Page Loader
HDFC bank- ICICI Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభంలో 1.3% తగ్గుదల.. ఐసీఐసీఐ 15.9% వృద్ధితో పెరుగుదల
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభంలో 1.3% తగ్గుదల.. ఐసీఐసీఐ 15.9% వృద్ధితో పెరుగుదల

HDFC bank- ICICI Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభంలో 1.3% తగ్గుదల.. ఐసీఐసీఐ 15.9% వృద్ధితో పెరుగుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్‌ రంగంలో కీలక బ్యాంకులుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. అయితే యాక్సిస్‌ బ్యాంక్‌ ఫలితాలు నిరాశ కలిగించిన నేపథ్యంలో మిగతా బ్యాంకుల లాభాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.16,258 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.16,475 కోట్లతో పోలిస్తే 1.31 శాతం తగ్గుదల. అయితే స్టాండలోన్‌ ప్రాతిపదికన లాభం మాత్రం రూ.16,174 కోట్ల నుంచి రూ.18,155 కోట్లకు పెరిగింది.

Details

ఆదాయ వివరాలివే

మొత్తం ఆదాయం: రూ.83,701 కోట్ల నుంచి రూ.99,200 కోట్లకు పెరిగింది. మొత్తం ఖర్చులు: రూ.59,187 కోట్ల నుంచి రూ.63,467 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు (NIM): 3.46 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గాయి. ప్రావిజన్లు: రూ.2,602 కోట్ల నుంచి భారీగా పెరిగి రూ.14,442 కోట్లకు చేరాయి. స్థూల నిరర్థక ఆస్తులు (GNPA): 1.33 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగాయి.

Details

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో ఏకీకృతంగా రూ.13,558 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.11,696 కోట్లు లాభంగా నమోదైన సంగతి తెలిసిందే. లాభ వృద్ధి : 15.9 శాతం పెరుగుదల. స్టాండలోన్‌ లాభం: రూ.11,059 కోట్ల నుంచి రూ.12,768 కోట్లకు (15.5% వృద్ధి). నికర వడ్డీ ఆదాయం (NII): 10.6 శాతం పెరిగి రూ.21,635 కోట్లకు చేరింది. వడ్డీ మార్జిన్లు: 4.41 శాతం నుంచి 4.34 శాతానికి స్వల్పంగా తగ్గాయి. ప్రావిజన్లు: రూ.1,332 కోట్ల నుంచి రూ.1,815 కోట్లకు పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తులు (GNPA)**: 2.15 శాతం నుంచి 1.67 శాతానికి తగ్గాయి.