HDFC Bank: క్యూ3 ఫలితాలు ప్రకటించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ .. రూ. 16,736 కోట్లకు పెరిగిన లాభం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్యూ3 ఫలితాలను ప్రకటించింది.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు సుమారు 2.2% పెరిగి రూ. 16,736 కోట్ల నికర లాభాన్ని సాధించింది.
2023 డిసెంబర్ త్రైమాసికంలో ఈ లాభం రూ. 16,373 కోట్లుగా నమోదైంది. అయితే, మార్కెట్ అంచనా వేసిన రూ. 17,233 కోట్లకంటే బ్యాంకు లాభం తక్కువగా నమోదైంది.
నికర వడ్డీ ఆదాయం 7.7% పెరిగి రూ. 30,650 కోట్లకు చేరుకుంది, ఇది 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 28,470 కోట్లుగా ఉన్నది.
వివరాలు
హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 76,583 కోట్లు
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 76,583 కోట్లుగా ఉంది.
ఇది 2023 డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 70,583 కోట్లతో పోల్చితే 7.7% వృద్ధి చెందింది.
క్యూ3లో బ్యాంకు నికర ఆదాయం 6.3% పెరిగి రూ. 42,110 కోట్లకు చేరుకుంది, 2023 డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 39,160 కోట్లుగా ఉంది.
డిపాజిట్లు:
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు యావరేజ్ డిపాజిట్లు రూ. 24,52,800 కోట్లుగా ఉన్నాయి, ఇది 2023 డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 21,17,100 కోట్లతో పోల్చి 15.9% పెరిగింది.
సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే 4.2% వృద్ధి నమోదైంది.
వివరాలు
అడ్వాన్సెస్:
క్యూ3లో బ్యాంకు అడ్వాన్సెస్ అండర్ మేనేజ్మెంట్ సగటున రూ. 26,27,600 కోట్లుగా ఉన్నాయి, ఇది 2023 డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 24,41,400 కోట్లతో పోల్చి 7.6% పెరిగింది.
సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే 2.5% వృద్ధి నమోదైంది. గ్రాస్ అడ్వాన్సులు రూ. 25,42,600 కోట్లుగా ఉన్నాయి, ఇది 2023 డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 24,70,500 కోట్లతో పోల్చి 3% పెరిగింది.
రిటైల్, కమర్షియల్, కార్పొరేట్ లోన్లు: డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు రిటైల్ లోన్లు 10% పెరిగాయి. కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ లోన్లు 11.6% పెరిగాయి.
కార్పొరేట్,ఇతర హోల్ సేల్ లోన్లు 10.4% పెరిగాయి. టోటల్ అడ్వాన్సెస్ లో ఓవర్సీస్ అడ్వాన్సులు 1.8% పెరిగాయి.
వివరాలు
బ్యాలెన్స్ షీట్:
2024 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు బ్యాలెన్స్ షీట్ సైజ్ రూ. 37,59,000 కోట్లుగా ఉంది, 2023 డిసెంబర్ ముగిసే నాటికి ఇది రూ. 34,92,600 కోట్లుగా ఉంది.
బ్రాంచీలు, ఏటీఎంలు: 2024 డిసెంబర్ నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు దేశవ్యాప్తంగా 9,143 బ్రాంచీలను, 21,049 ఏటీఎంలను కలిగి ఉంటుంది. 2023 డిసెంబర్ త్రైమాసిక ముగిసే నాటికి బ్రాంచీలు 8,091, ఏటీఎంలు 20,688 ఉన్నాయి.
షేరు ధర: హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్యూ3 ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయినా,ఈ బ్యాంకు షేరు ధర 1.80% పెరిగి రూ. 1,671 వద్ద ముగిసింది.ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయిగా రూ.1,880 కనిష్ట స్థాయిగా రూ.1,363 వద్ద ఉంది.మార్కెట్ విలువ రూ. 12.73 లక్షల కోట్లుగా ఉంది.