Page Loader
HDFC Bank bonus share: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోనస్ షేర్లు: షేర్‌హోల్డర్లకు బంపర్ గిఫ్ట్ రానుందా? 19న బోర్డు కీలక సమావేశం 
హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌హోల్డర్లకు బ్యాంక్ బోనస్ షేర్లు.. 19న బోర్డు కీలక సమావేశం

HDFC Bank bonus share: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోనస్ షేర్లు: షేర్‌హోల్డర్లకు బంపర్ గిఫ్ట్ రానుందా? 19న బోర్డు కీలక సమావేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్ రంగంలోని అగ్రగామి బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank)బోర్డు జూలై 19న సమావేశం కాబోతుందని సంస్థ వెల్లడించింది. ఈ భేటీలో బోనస్ షేర్ల జారీ, మధ్యంతర డివిడెండ్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బోర్డు బోనస్ షేర్లకు ఆమోద ముద్ర వేసినట్లయితే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చరిత్రలో ఇది తొలి సారి బోనస్ షేర్లు జారీ అవుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్-జూన్(Q1)త్రైమాసిక ఫలితాల ప్రకటనే ఈ బోర్డు సమావేశం ప్రధాన ఉద్దేశమని బ్యాంక్ ఇప్పటికే జూన్ 23న తెలిపింది. అయితే తాజాగా స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, బోనస్ షేర్ల జారీ, మధ్యంతర డివిడెండ్ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశముందని స్పష్టం చేసింది.

వివరాలు 

గత ఆర్థిక సంవత్సరంలో  డివిడెండ్ ప్రకటన 

ఈ ప్రకటన నేపథ్యంలో బుధవారం రోజున హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ధర 1.33 శాతం పెరిగి రూ.2,021 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయితే బోనస్ షేర్ల జారీ ప్రక్రియ పూర్తయ్యేందుకు నియంత్రణ సంస్థలు, వాటాదార్ల అనుమతులు తప్పనిసరని బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి గానూ బ్యాంక్ తుది త్రైమాసికంలో ఒక్కో షేరుపై రూ.22 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఇటీవల కాలంలో బ్యాంక్ షేర్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో షేర్ల ధర 23.01 శాతం పెరగగా, గత ఆరు నెలల్లో 21.46 శాతం లాభాలను సాధించింది.

వివరాలు 

వాటాదారులకు గుడ్ న్యూస్

మూడు నెలల వ్యవధిలో 6.99 శాతం రాబడిని అందించగా, గత ఒక నెల కాలంలో 4.07 శాతం పెరిగింది. బ్యాంక్ పనితీరు మెరుగ్గా ఉండటంతో వాటాదారులకు గుడ్ న్యూస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా, గతంలో 2011, 2019 సంవత్సరాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ స్ప్లిట్ ప్రకటించిన విషయం గమనార్హం.