
HDFC &Kotak Bank Q2 results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం రూ.16,821 కోట్లు.. కోటక్ లాభంలో 5 శాతం వృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ రూ. 16,821 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 15,976కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది.
ఈ సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 78,406కోట్ల నుండి రూ. 85,500 కోట్లకు పెరిగినట్లు తెలియజేసింది.
వడ్డీ ఆదాయం రూ. 67,698కోట్ల నుండి రూ. 70,017కోట్లకు చేరినట్లు పేర్కొంది.నికరంగా రూ. 30,110 కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.
బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు(అమానతైన రుణాలు)1.34 శాతం నుండి 1.36 శాతానికి పెరిగాయని, నికర ఎన్‌పీఏలు 0.35 శాతం నుండి 0.41 శాతానికి చేరినట్లు పేర్కొంది.
వివరాలు
కోటక్ లాభంలో 5 శాతం వృద్ధి
ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ. 17,826 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా లాభాల్లో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది.స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ రూ.3,344 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.3,191 కోట్లుగా ఉంది.
మొత్తం ఆదాయం రూ.13,507 కోట్ల నుండి రూ.15,900 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది.ఏకీకృత ప్రాతిపదికన రూ. 5,044 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
వడ్డీ ఆదాయం రూ.7,020 కోట్లు కాగా,ఇది గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధిని నమోదు చేసింది.
బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 1.72శాతం నుండి 1.49 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు 0.37 శాతం నుండి 0.43 శాతానికి పెరిగినట్లు పేర్కొంది.