
Health Policy- Premiums-Hike: ప్రీమియం పెంచనున్న బీమా కంపెనీలు?
ఈ వార్తాకథనం ఏంటి
బీమా సంస్థలు తమ ప్రీమియంలను పెంచేశాయి.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ ఇటీవలే పలు మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
ఈ నిబంధనలు ఫలితంగా ఆరోగ్య భీమా పాలసీలు మరింత భారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి .
రోజురోజుకు హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతుండటంతో వాటిని తట్టుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది.
కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకుంటున్నారు.
అయితే భారతీయ భీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్ డిఏఐ) ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.
దీంతో ఇండియా లోనే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలను పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Premiums-Hike
65 ఏళ్ల వయోపరిమితిని ఎత్తేసిన ఐఆర్డీఐ
ఇదివరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు గరిష్ట వయోపరిమితి 65 ఏళ్ళు ఉండగా దాన్ని ఐ ఆర్ డి ఐ తొలగించి వయోపరిమితిని ఎత్తివేసింది.
ఇక ముందస్తు వ్యాధుల విషయంలో వేచి ఉండే సమయాన్ని నాలుగేళ్ల నుంచి మూడు ఏళ్లకు కుదించింది.
ఈ నిర్ణయంతో ఇండియాలోని ఇన్సూరెన్స్ కంపెనీలకు అధికంగా క్లెయిమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ కారణంగానే ఆ ప్రీమియంలను సర్దుబాటు చేసేందుకు భీమా కంపెనీలన్నీ సిద్ధమవుతున్నాయి.
పాలసీలను బట్టి కొత్త ప్రీమియం రేట్లు జూలై లేదా ఆగస్టు నుంచి అమలు అవుతాయని సమాచారం.
ఈ బీమా సంస్థలు గరిష్టంగా 10 శాతం నుంచి 15% వరకు ప్రీమియం పెంచే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు .