Page Loader
Hero FinCorp: ఐపీఓకు ముందు రూ.260 కోట్లు సమీకరించిన హీరో ఫిన్‌కార్ప్‌
ఐపీఓకు ముందు రూ.260 కోట్లు సమీకరించిన హీరో ఫిన్‌కార్ప్‌

Hero FinCorp: ఐపీఓకు ముందు రూ.260 కోట్లు సమీకరించిన హీరో ఫిన్‌కార్ప్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ అనుబంధ ఆర్థిక సేవల సంస్థ హీరో ఫిన్‌కార్ప్‌ (Hero FinCorp) బోర్సాల లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా, సంస్థ ఐపీఓకు ముందు (pre-IPO) రౌండ్‌ ద్వారా రూ.260 కోట్లను సమీకరించింది. దీని ప్రభావంగా పబ్లిక్‌ ఇష్యూలో జారీ చేయాల్సిన తాజా షేర్ల పరిమాణం రూ.2,100 కోట్ల నుంచి రూ.1,840 కోట్లకు తగ్గిపోయింది. అదేవిధంగా మొత్తం ఐపీఓ పరిమాణం రూ.3,668 కోట్ల నుంచి రూ.3,408 కోట్లకు క్షీణించింది.

Details

ప్రీ-ఐపీఓ రౌండ్‌లో పెట్టుబడులు

హీరో ఫిన్‌కార్ప్‌ జూన్‌ 5న నిర్వహించిన ప్రీ-ఐపీఓ రౌండ్‌లో 12 మంది పెట్టుబడిదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్కో షేరు ధరను రూ.1,400గా నిర్ణయించి 18.57 లక్షల షేర్లను వారికీ కేటాయించింది. దీంతో, రూ.260 కోట్లను సమీకరించగలిగింది. ఐపీఓకు మద్దతుగా హీరో ఫిన్‌కార్ప్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియను 2023 నుంచే ప్రారంభించింది. ఈ ఏడాది మేలో, కంపెనీ ఐపీఓకు సెబీ అనుమతి పొందింది. ఈ ఇష్యు ద్వారా సమీకరించే నిధులను భవిష్యత్తు రుణ కార్యకలాపాలకు అవసరమైన మూలధనం పెంపు* కోసం వినియోగించనుంది.

Details

సంస్థ వివరాలు

హీరో ఫిన్‌కార్ప్‌ ఒక నాన్-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (NBFC). ఇది రిటైల్‌, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరగతి వ్యాపారాల‌కు రుణాలు అందిస్తోంది. 2024 మార్చి నాటికి సంస్థ ఆస్తుల విలువ రూ.51,821 కోట్లు కాగా, కస్టమర్ల సంఖ్య 1.18 కోట్లుగా ఉంది. ఈ ప్రీ-ఐపీఓ సమీకరణతోపాటు, పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్‌లోకి రావడానికి సంస్థ చేసిన సన్నాహాలు మదుపర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.