Page Loader
జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్
జాతీయవాదంతో మోసాన్ని కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్

జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 30, 2023
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల ఆరోపణల నివేదికపై స్పందిస్తూ ఇది భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్‌ను ఇప్పట్లో వదిలేలా లేవు. ఈ నివేదిక విడుదలైన తర్వాత, గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.2 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ నివేదిక అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన రూ. 20,000 కోట్ల FPOపై ఉన్న ఆసక్తిని కూడా తగ్గించేసింది. అదానీ గ్రూప్ నివేదికపై చేసిన 413-పేజీల ఖండనకు సమాధానంగా ఈ ఆరోపణల నుండి దృష్టిని మార్చడానికి ఈ జాతీయవాద కథనాన్ని ప్రేరేపిస్తుందని, అదానీ గ్రూప్ పెరుగుదలను, ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపదను భారతదేశ విజయంతో కలపడానికి ప్రయత్నిస్తుందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పేర్కొంది.

వ్యాపారం

అదానీ గ్రూప్ దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటుందంటున్న హిండెన్‌బర్గ్

అదానీ గ్రూప్ తన నివేదికను భారత్‌పై దాడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని హిండెన్‌బర్గ్ విమర్శిస్తూ భారతదేశం ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యం, మంచి భవిష్యత్తుతో అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ అని ప్రపంచం నమ్ముతుంది. దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటూ భారత జెండాను కప్పుకున్న అదానీ గ్రూప్ భారతదేశ భవిష్యత్తును వెనుకకు తోసేస్తుందని అంది. అదానీ గ్రూప్ నివేదికపై ఖండిస్తూ విడుదల చేసిన 413-పేజీలలో హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అన్ని 88 ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే 88 ప్రశ్నల్లో 62 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడంలో విఫలమైందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. వివిధ ఆఫ్‌షోర్ షెల్ కంపెనీలతో అదానీ గ్రూప్ వ్యవహారాలపై హిండెన్‌బర్గ్ ప్రశ్నలు లేవనెత్తింది. నివేదిక ప్రకారం, ఇవి గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నేతృత్వంలో నడుస్తున్నాయి.