ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన
ఈ నెల ప్రారంభంలో, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో సిబ్బందిని తొలగించిన కంపెనీల లిస్ట్ లో గూగుల్ చేరింది. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం చాలామంది జీవితాలను తలకిందులు చేసింది. ఇది బాధిత ఉద్యోగుల నుండి వ్యతిరేకతకు దారితీసింది. మాంద్యం భయంతో టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి కాబట్టి, ఊహించని ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఉద్యోగులను తొలగించాలనే గూగుల్ నిర్ణయం ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నవారితో పాటు, ఉత్తమ పనితీరుని చూపించిన వారిపై కూడా పడింది. ఎంత జీతం తీసుకున్నా, ఈ తొలగింపులు భయాన్ని కలిగిస్తాయి. అయితే, ఇది ఒక అవకాశం కూడా అని బాధిత ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి.
ఈ బాధిత ఉద్యోగులను బర్న్స్ The Golden 12k అని పిలుస్తున్నారు
'Xooglers' (గూగుల్ మాజీ ఉద్యోగులు) లింక్డ్‌ఇన్, టిక్‌టాక్‌తో సహా వివిధ సోషల్ మీడియా వేదికలపై ఈ తొలగింపుల గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాస్టెల్ JR బర్న్స్, అనే గూగుల్ మాజీ ఉద్యోగి తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తనతో పాటు ఉన్న బాధిత ఉద్యోగులను తోటి US Xooglers అని సంబోధించారు. ఈ 12,000 మందిని అతను "The Golden 12k" అని పిలుస్తున్నారు. వీరు ఉద్యోగాలు కోల్పోయినప్పటికి వారికి అద్భుతమైన అనుభవాన్ని గూగుల్ ఇచ్చిందని ఇది విజయంగా భావించి, తర్వాతి కెరీర్ కోసం రీఛార్జ్ అవ్వడం అంటే, కుటుంబంతో సమయం గడపడమని ఆ బాధిత ఉద్యోగులను ఉద్దేశించి అతను తెలిపారు .