
EPFO UAN: మీ యూఏఎన్ నంబర్ మర్చిపోయారా? ఆ సంఖ్యను తిరిగి ఇలా పొందొచ్చు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు యూఏఎన్ (UAN) నంబర్ అనేది అత్యంత కీలకమైనది. ఇది ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు కేటాయించే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఈ నంబర్ ద్వారా సభ్యులు ఈపీఎఫ్ ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా సులభంగా లాగిన్ కావచ్చు. అదే విధంగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, వ్యక్తిగత వివరాలు, కేవైసీ సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయడం, ఖాతాలను విలీనం చేయడం లాంటి అనేక సేవలు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేయాలన్నా యూఏఎన్ అవసరమవుతుంది. అటువంటి ముఖ్యమైన నంబర్ మర్చిపోతే, కొన్ని తేలికపాటి దశల ద్వారా మీరు దానిని తిరిగి తెలుసుకోవచ్చు.
వివరాలు
యూఏఎన్ నంబర్‌ను తెలుసుకునే విధానం:
1. ముందుగా ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ అయిన epfindia.gov.in వెబ్‌పోర్టల్‌ను సందర్శించండి. ఈ సైట్‌లో ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అనేక సేవలు లభిస్తాయి. 2. హోమ్ పేజీలో ఉన్న 'సర్వీసెస్' విభాగానికి వెళ్లాలి. అక్కడ 'For Employees' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఈ విభాగంలో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, యూఏఎన్ సంబంధిత ఇతర సేవలు లభిస్తాయి. 3. తరువాత 'For Employees' సెక్షన్‌లోని 'Member UAN/Online Services' పై క్లిక్ చేయాలి. ఈ విభాగంలో యూఏఎన్‌ను తిరిగి పొందడం, కేవైసీ అప్‌డేట్ చేయడం, పాస్‌బుక్‌ను చూడటం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
వివరాలు
యూఏఎన్ నంబర్‌ను తెలుసుకునే విధానం:
4. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత, మీ పూర్తి పేరు, పుట్టిన తేది, పాన్ నంబర్, ఆధార్ వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, కనిపించే క్యాప్చాను టైప్ చేసి 'Request OTP' బటన్‌పై క్లిక్ చేయాలి. 5. మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ (One Time Password) వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి ధృవీకరించండి. అనంతరం 'Show My UAN' అనే బటన్‌పై క్లిక్ చేస్తే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) స్క్రీన్‌పై కనిపిస్తుంది.