Car insurance claim : కారు బీమా క్లెయిమ్ ఎలా చేయాలి..? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
కార్ కొనడం చాలా మందికి కల. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదం లేదా ప్రకృతి వైపరిత్యాల వల్ల కారు దెబ్బతినడం ఆ కలను చెడగొట్టొచ్చు.
మరమ్మత్తు ఖర్చులు భారంగా ఉండటంతో కారుకు బీమా ఉండటం ఎంతో అవసరం. కారు బీమా మన వాహనానికి రక్షణ కవచం లాంటిది. కానీ బీమా క్లెయిమ్ ప్రక్రియలో చాలామందికి సందేహాలుంటాయి.
ఈ క్లెయిమ్‌ని ఎలా సులభంగా చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1)ప్రమాదం గురించి బీమా కంపెనీకి సమాచారం ఇవ్వండి
వాహనానికి జరిగిన నష్టం, ప్రమాదం గురించి మీ బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి.
మీ వాహనానికి జరిగిన నష్టాన్ని ఎలాంటి వివరాలు దాచకుండా, నిజాయితీగా తెలియజేయాలి. అవకతవకలు చేస్తే, క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి.
Details
2) ప్రమాదానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి
ప్రమాదం, దొంగతనం, అగ్నిప్రమాదం వంటి ఘటనలు జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అవసరం.
చిన్న చిన్న దెబ్బలు, గీతలు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ అవసరం లేకపోవచ్చు. అయితే థర్డ్ పార్టీ ప్రమేయం ఉంటే ఎఫ్ఐఆర్ తప్పనిసరి.
3) ప్రమాద స్థలంలో ఫొటోలు తీయండి
ప్రమాదానికి సంబంధించిన పరిసరాలు, వాహనం డ్యామేజ్ జరిగిన తీరు ఫొటోల్లో స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.
ఇది బీమా ప్రొవైడర్‌కు వాహన నష్టాన్ని అంచనా వేయడంలో సాయపడుతుంది.
4) అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి
క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, బీమా పాలసీ, ఎఫ్ఐఆర్ కాపీ, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి పత్రాలను బీమా సంస్థకు సమర్పించాలి.
Details
5) వాహనాన్ని రిపేర్ చేయండి
వాహనాన్ని రిపేర్ కోసం గ్యారేజీకి తీసుకెళ్లవచ్చు లేదా బీమా సంస్థను సంప్రదించవచ్చు.
మీరు ప్రొవైడర్ నుంచి ముందస్తు నగదు పొందవచ్చు లేదా పూర్తి డ్యామేజ్ రిపేర్ ఇన్వాయిస్ సమర్పించి రీయింబర్స్ చేసుకోవచ్చు.
6)ప్రకృతి వైపరీత్యాల వల్ల కారు దెబ్బతిన్నప్పుడు
ప్రకృతి వైపరీత్యాల కారణంగా కారు దెబ్బతిన్నప్పుడు కూడా బీమా కవరేజ్ క్లెయిమ్ చేయవచ్చు. అయితే బీమా పాలసీలో కవర్ చేసిన అంశాలను ముందుగా స్పష్టంగా తెలుసుకోవాలి.
ఈ సందర్భంలో, బీమా సంస్థను వెంటనే సంప్రదించి డ్యామేజ్ వివరాలను అందించాలి. సర్వేయర్ ద్వారా నష్టం అంచనా వేయించి, కారు రిపేర్ ప్రక్రియను ప్రారంభించవచ్చు.
ఈ సూచనలు పాటిస్తూ, మీ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సులభంగా చేయండి