LOADING...
Infosys: ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్!
ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్!

Infosys: ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయంగా రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన 'ఇన్ఫోసిస్‌'కు భారీ ఊరట లభించింది. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ ప్రీ-షోకాజ్ నోటీసు వ్యవహారంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ (DGGI) సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. డీజీజీఐ నుంచి అందిన సమాచార ప్రకారం, 2018-19 నుంచి 2021-22 మధ్యకాలానికి సంబంధించిన ప్రీ-షోకాజ్ ప్రొసీడింగ్స్‌ పూర్తిగా మూసివేసినట్లు సమాచారం ఇచ్చినట్లు ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. గతంలో 2017 నుంచి 2022 మధ్య ఇన్ఫోసిస్‌ విదేశీ శాఖల ఖర్చులపై, రూ.32,403 కోట్ల GST నోటీసు జారీ అయింది.

Details

కేంద్ర, రాష్ట్ర నిబంధలను పాటిస్తున్నాం

ఈ ప్రీ-షోకాజ్ నోటీసును కర్ణాటక రాష్ట్ర జీఎస్‌టీ అధికారులు జారీ చేశారు. విదేశీ శాఖల నుండి దిగుమతి చేసుకున్న సేవలపై రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద ఈ నోటీసు ఇచ్చారు. ఈ మొత్తం, 2025 జూన్ 30తో ముగిసే త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సాధించే ఆదాయంలో 85 శాతానికి సమానం కావడం గమనార్హం. అప్పట్లో ఈ నోటీసులపై స్పందించిన ఇన్ఫోసిస్, తమపై ఉన్న అన్ని జీఎస్‌టీ బాకీలను ఇప్పటికే చెల్లించామని, అన్ని కేంద్ర, రాష్ట్ర నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పుడు డీజీజీఐ ఈ కేసును ముగిస్తూనే క్లిన్చిట్ ఇవ్వడంతో, ఇన్ఫోసిస్‌కు ఇది స్థిరత, విశ్వసనీయత పరంగా ఒక గొప్ప ఊరటగా భావిస్తున్నారు.