
IMF: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నుంచి భారీ ఊరట.. $1 బిలియన్ నిధులు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఊరటనిచ్చింది.
ఐఎంఎఫ్ భారీగా 1 బిలియన్ డాలర్ల (భారత రూపాయలలో సుమారుగా రూ. 8,500 కోట్లు) ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది.
దీని వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. ఈ సహాయం భారత్‌కు ముప్పుగా మారవచ్చన్న ఆందోళనలు తలెత్తుతున్నాయి.
ఈ నిధులను విడుదల చేయడానికి ఐఎంఎఫ్ పాకిస్తాన్‌పై కొన్ని షరతులు విధించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో ఈ నిధులు ఆ దేశానికి ఎంతో అవసరమయ్యాయి.
పాకిస్థాన్ ఇప్పుడు ఈ సొమ్మును ఉపయోగించి తన ఆర్థిక వ్యవస్థను కొంతవరకు గాడిలో పెట్టే యత్నం చేసే అవకాశం ఉంది.
Details
భారత్ కు ముప్పు వాటిల్లే అవకాశం
అయితే, పాకిస్థాన్ ఈ నిధులను నిజంగా అభివృద్ధి కార్యకలాపాలకే వినియోగిస్తుందా?లేక ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా మారుతాయా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కొంతమంది విశ్లేషకులు ఈ సొమ్ముతో ప్రజల అవసరాలను తీర్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇటీవల భారత్‌తో సరిహద్దుల్లో పాక్ విరుచుకుపడుతున్న దాడులు, డ్రోన్ల దాడులు, క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఐఎంఎఫ్ నుంచి వచ్చిన నిధులు ఆ దేశానికి మరింత బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
టర్కీ సహకారంతో పాక్ ఉగ్రవాద కార్యకలాపాలు ముమ్మరంగా సాగిస్తున్నదీ తాజా నివేదికల్లో వెల్లడైంది.
ఈ పరిణామాలన్నీ చూస్తే, ఐఎంఎఫ్ ఆర్థిక సాయం పాక్ ఆర్థిక వ్యవస్థను బలపరిచే అవకాశం కల్పించడమే కాక, భవిష్యత్తులో భారత్‌కు ముప్పుగా మారే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.