Net Direct Tax Collections: కేంద్ర ఖజానాకు భారీ ఆదాయం.. రూ.14.42 లక్షల కోట్ల పన్ను వసూళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి నవంబరు 10 వరకు వార్షిక ప్రాతిపదికన 11.76 శాతం వృద్ధి నమోదై రూ.14.42 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వెల్లడించింది. కార్పొరేట్ పన్నుల్లో 18 శాతం వృద్ధి మొత్తం నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ సంస్థల వాటా 18 శాతం వృద్ధితో రూ.6.32 లక్షల కోట్లకు చేరింది. నాన్ కార్పొరేట్ పన్నుల (వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు-HUFలు) వసూళ్లు 5.3 శాతం పెరిగి రూ.7.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
వివరాలు
52 శాతం పెరిగిన ఎస్‌టీటీ వసూల్లు
సెక్యూరిటీల లావాదేవీ పన్ను (STT) వసూళ్లు ఏకంగా 52 శాతం వృద్ధి చెంది రూ.54,078 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పన్ను రిఫండ్‌లు 26 శాతం పెరిగి రూ.3.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
స్థూల పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు
మరోవైపు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 14 శాతం వృద్ధితో రూ.17.50 లక్షల కోట్లకు చేరాయి.
ఇందులో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.8.01 లక్షల కోట్లుగా ఉండగా.. స్థూల నాన్ కార్పొరేట్ పన్నులు రూ.8.94 లక్షల కోట్లకు పెరిగాయి.
వివరాలు
వార్షిక లక్ష్యంలో 53 శాతం పూర్తి
2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.26.97 లక్షల కోట్లు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా నిర్దేశించుకుంది.
నవంబరు 10 నాటికి ఈ లక్ష్యంలో సుమారు 53.5 శాతం ఇప్పటికే సాధించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.23.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.