హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం
భారత్ లోని విదేశీయులకు ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలచింది. తర్వాత స్థానాల్లో వరుసగా దేశ రాజధాని దిల్లీ, మెట్రో నగరాలు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది. ఆయా నగరాల్లో కనీస మౌలిక సదుపాయాలైన ఆహారం, వసతి, దుస్తులు, రవాణా, గృహోపకరణాలు, వినోదం లాంటి 200 అంశాలకు అయ్యే ఖర్చు వివవరాలను, అందుకు అయ్యే వ్యయాలను అంచనా వేసి ఈ జాబితాను సిద్ధం చేశారు. దాదపు 5 ఖండాలు, 227 నగరాల్లో సర్వే ఖరీదైన నగరాల లిస్టులో ప్రపంచ వ్యాప్తంగా ముంబయి 147 ప్లేస్ దక్కించుకుంది.
చైనా జపాన్ నగరాలతో పోల్చితే భారత నగరాలే భేష్
అనంతరం దిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్‌కతా 211, పుణె 213వ స్థానాలను పొందాయి. ఆసియాకే చెందిన హాంకాంగ్, సింగపూర్, జూరిచ్ తొలి మూడు స్థానాల్లో నిలవడం విశేషం. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో హవానా, పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్ ఉండటం గమనార్హం. ఇక మల్టినేషనల్ కంపెనీలకు సంబంధించి వ్యయాల పరంగా ముంబయి 147, దిల్లీ 169 మంచి స్థానాలనే నిలబెట్టుకున్నాయి. చైనా షాంఘై, బీజింగ్, జపాన్ లోని టోక్యోలతో పోలిస్తే భారత నగరాలే భేషుగ్గా ఉన్నాయి. ఆసియాలోనే అత్యంత ఖరీదైన 35 నగరాల్లో ముంబయి, దిల్లీ స్థానం దక్కించుకున్నాయి. గత సంవత్సరంతో పోల్చితే ముంబయి ఒక స్థానం మేర తగ్గి 27కు చేరుకోవడం విశేషం.
టాప్ 20 లిస్ట్ లో భారత నగరాల్లేవ్
ఇంటర్నేషనల్ ర్యాంకులో భాగంగా భారత నగరాల స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. కరెన్సీ కదలికలు, యూరప్ ప్రాంతాల్లోని వస్తువులు వాటి సేవల ధరల్లో వచ్చిన మార్పులే కారణంగా నిలిచాయి. ఫలితంగానే చైనా దేశంలోని ప్రధాన నగరాలు టాప్-10 జాబితాలో స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే సుమారు 120 దేశాలకు సంబంధించిన 207 నగరాల్లో లైఫ్ స్టాండర్డ్స్ ని విశ్లేషించిన ఈ జాబితాలో టాప్-20లో భారత నగరానికి చోటే దొరకలేదు. 2023లో నివాస యోగ్యతకు మోస్ట్ కాస్ట్లీ సిటీస్ లిస్ట్ ఇదే : 1. న్యూయార్క్ 2. హాంకాంగ్, 3. జెనీవా 4. లండన్ 5. సింగపూర్ 6. జ్యూరిచ్ 7. శాన్ ఫ్రాన్సిస్కో 8. టెల్ అవీల్ 9. సియోల్ 10. టోక్యో.