Page Loader
Hyundai IPO: పూర్తైన హ్యుందాయ్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ .. క్యూఐబీ కోటా నుంచి అత్యధిక బిడ్లు
పూర్తైన హ్యుందాయ్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ .. క్యూఐబీ కోటా నుంచి అత్యధిక బిడ్లు

Hyundai IPO: పూర్తైన హ్యుందాయ్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ .. క్యూఐబీ కోటా నుంచి అత్యధిక బిడ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ మోటార్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (Hyundai IPO) చివరకు పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. సబ్‌స్క్రిప్షన్ గడువు చివరి రోజు ఈ సబ్‌స్క్రిప్షన్ పూర్తి కావడం విశేషం. రూ. 27,870 కోట్ల విలువైన ఈ ఐపీఓకి మధ్యాహ్నం 1.21 గంటల నాటికి 1.41 రెట్లు బిడ్లు దాఖలు అయినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా తెలియజేసింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా (QIB) 3.88 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 44 శాతం సబ్‌స్క్రిప్షన్ పొందగా, నాన్ ఇన్వెస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భాగం 39 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. నేటితో బిడ్ల దాఖలుకు గడువు ముగియనుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ. 8,315 కోట్లు సమీకరించింది.

వివరాలు 

ఎల్‌ఐసీ కంటే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన హ్యుందాయ్ మోటార్

ఎల్‌ఐసీ కంటే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన హ్యుందాయ్ మోటార్, ఈ పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరు ధరలను రూ.1865-1960గా నిర్ణయించింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరుగుతున్న షేర్ల విక్రయం. తాజా షేర్ల జారీ లేకపోవడం గమనార్హం. తొలిరోజులలో బిడ్ల దాఖలు స్లోగా సాగినప్పటికీ, సబ్‌స్క్రిప్షన్ గడువు చివర్లో పూర్తిస్థాయిలో సబ్‌స్క్రిప్షన్ అందుకుంది.