Page Loader
చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కదిలిన కేంద్రం.. కేవైసీని పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి
చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కేవైసీని పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి కేంద్రం విజ్ఞప్తి

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కదిలిన కేంద్రం.. కేవైసీని పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 23, 2023
06:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు కేవైసీని మరింత విస్తృతంగా, పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకింగ్ రెగ్యూలేషన్ ను పటిష్ఠంగా నిర్వహించాలని ఆర్ బి ఐని కేంద్రం తరఫున ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వివరణాత్మకంగా నో యువర్ డిజిటల్ ఫైనాన్స్ యాప్ (KYDFA) ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించాలని సిఫార్సు చేసింది. అక్రమ ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లతో పెరుగుతున్న ముప్పును పరిష్కరించేందుకు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సహాయ మంత్రి కదం తొక్కారు.

details

వివరణాత్మక KYCని రూపొందించమని కోరుతున్నాం : మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 

బ్యాంకుల నుంచి మరింత వివరణాత్మక KYC ప్రక్రియను రూపొందించాలని ఆ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కోరారు. ఇది అక్రమ లోన్ యాప్‌లను పట్టుకోవడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. అక్టోబరు 13న, ఇందుకు సంబంధించి జరిగిన సమావేశంలో ఆర్థిక సేవల విభాగం (DFS), ఆర్బీఐకి తమ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలియజేసిందన్నారు. కస్టమర్‌లు బ్యాంక్ ఖాతాను తెరవడానికి వివరణాత్మక KYC చేయించుకోవాల్సిన విధంగానే, మేము నో యువర్ డిజిటల్ ఫైనాన్స్ యాప్ (KYDFA)గా సూచించే కంపెనీల కోసం వివరణాత్మక KYCని రూపొందించమని కోరుతున్నామన్నారు. ఆర్‌ బి ఐ, డీఎఫ్‌ఎస్‌లతో సమావేశం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు.