HSBC: పెళ్లి సీజన్ ప్రభావం.. కార్ల అమ్మకాలు మందగింపు, ద్విచక్ర వాహనాలకు బలే గిరాకీ
పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న డిమాండ్, పెళ్లి సీజన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు డిమాండ్ పెరుగుతోందని బ్రోకరేజీ సంస్థ HSBC తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే కార్లు, వాణిజ్య వాహనాల విభాగంలో డిమాండ్ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ 2023 అమ్మకాలు ప్రకటించిన తరువాత, డిసెంబరు 3న ఈ నివేదికను వెల్లడించింది. నవంబరులో కార్ల అమ్మకాలు మందగించాయి. ప్రత్యేకంగా పెళ్లి సీజన్ కారణంగా కారు అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల డిమాండ్ పెరగడం లేదు. కాబట్టి ఆటో కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను కొనసాగించాల్సి రావచ్చు.
టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు పెరిగాయి
ఇక FY25లో PV అమ్మకాలు 0-2% తగ్గే అవకాశం ఉందని HSBC తెలిపింది. మరుతి సుజుకి వాల్యూములు 10% పెరగ్గా, దేశీయ అమ్మకాలు 4% తగ్గాయి. వాటిలో యుటిలిటీ వాహనాలు 20శాతం మేర పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 46,000 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది నవంబర్ 2023తో పోలిస్తే 16శాతం పెరిగింది. టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు 2శాతం పెరగ్గా, వాటిలో ఈవీ అమ్మకాలు 9% పెరిగాయి. బజాజ్ ఆటో దేశీయ వాల్యూములు 7శాతం తగ్గాయి, కానీ ఎగుమతులు 26శాతం పెరిగాయి. TVS మోటార్ కంపెనీ రెండు చక్రాల వాహనాల వాల్యూములు 11శాతం పెరిగాయి. దేశీయ అమ్మకాలు 6శాతం పెరిగాయి. ఎగుమతులు కూడా 34శాతం పెరిగాయి.
37శాతం మార్కెట్ షేర్ సాధించిన ఎంజీ మోటార్స్
హిరో మోటోకార్ప్ దేశీయ అమ్మకాలు 8శాతం తగ్గాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ వాల్యూములు 4శాతం, ఎగుమతులు 96శాతం తగ్గాయి. అయితే వాణిజ్య వాహనాల డిమాండ్ ఇంకా మందగించవచ్చని నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా నవంబరులో ఈవీ అమ్మకాలు కొత్త ట్రెండ్‌ను చూపాయి. ఓలా ఎలక్ట్రిక్, ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నా, 25శాతం మార్కెట్ షేర్‌కి కుప్పకూలింది. మరొక వైపు ఈవీ నాలుగు చక్రాల మార్కెట్ షేర్ నవంబరులో 2.2శాతం పెరిగింది. టాటా మార్కెట్ షేర్ 49శాతానికి దిగజారింది. అయితే ఎంజీ మోటర్స్ 37శాతం మార్కెట్ షేర్‌ను సాధించింది.