Page Loader
Retail inflation: ఫిబ్రవరిలో 5.09 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం 
Retail inflation: ఫిబ్రవరిలో 5.09 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

Retail inflation: ఫిబ్రవరిలో 5.09 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం 

వ్రాసిన వారు Stalin
Mar 12, 2024
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

గణాంకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో స్వల్ప తగ్గుదల నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2024 జనవరిలో 5.10 శాతంగా ఉండగా.. ఫిబ్రవరిలో 5.09 శాతానికి తగ్గింది. డిసెంబర్ 2023లో ఇది 5.69 శాతంగా ఉంది. గతేడాది ఇదే ఫిబ్రవరి నెలలో 6.44 శాతంగా ఉంది. అయితే, ఫిబ్రవరి 2024లో ఆహార ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల కనిపించింది. ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 8.30 శాతం ఉంటే.. ఫిబ్రవరిలో 8.66 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) CPI ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే జనవరి-మార్చి త్రైమాసికంలో 5 శాతంగా నమోదైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెరిగిన ఆహార  ద్రవ్యోల్బణం