
ITR: ఆదాయపు పన్ను రిటర్న్స్ గడువు పొడిగింపు.. పెనాల్టీని ఎలా తప్పించుకోవాలి?
ఈ వార్తాకథనం ఏంటి
పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR Filing) ఆలస్యమవ్వక ముందే దాఖలు చేయాలి. సమయానికి ఐటీఆర్ సమర్పిస్తే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా భారీ పెనాల్టీలు తప్పించుకోవచ్చు. ITR గడువు తేదీ పొడిగింపు 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి గాను ఐటీఆర్ గడువు తేదీని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పొడిగించింది. సాధారణంగా ఈ గడువు జూలై 31, 2025 వరకు ఉంది. కానీ ప్రభుత్వం దానిని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. అంటే పన్ను చెల్లింపుదారులకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ గడువు లోపు రిటర్న్ దాఖలు చేస్తే రూ 5,000 వరకు జరిమానా తప్పించుకోవచ్చు.
Details
ఐటీఆర్ దాఖలు చేయకపోతే?
ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మీ సేవింగ్స్, రీఫండ్స్, రుణ మంజూరు వంటి ఆర్థిక విషయాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా, పన్ను శాఖ నిబంధనల ప్రకారం వడ్డీతో పాటు భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఐటీఆర్ అంటే ఏమిటి? ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అనేది పన్ను చెల్లింపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఆదాయం, దానిపై చెల్లించాల్సిన పన్ను వివరాలు తెలిపే అధికారిక ఫారమ్. ఇందులో నష్టాలను క్యారీ-ఫార్వర్డ్ చేసుకోవడం, రీఫండ్స్ క్లెయిమ్ చేసుకోవడం కూడా సాధ్యం.
Details
గడువు దాటితే పెనాల్టీ ఎంత?
గడువు దాటాక ఐటీఆర్ దాఖలు చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 234F, 139(1) ప్రకారం జరిమానా విధిస్తారు. ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే ఆలస్య రుసుము రూ. 1000 మాత్రమే. ఆదాయం రూ. 5 లక్షలకు పైగా ఉంటే ఆలస్య రుసుము రూ. 5,000 . వీటితో పాటు సెక్షన్ 234A, 234B, 234C కింద అదనపు వడ్డీ కూడా పడుతుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకండి ప్రభుత్వం సౌకర్యం కోసం గడువు తేదీని పొడిగించినప్పటికీ, చివరి నిమిషంలో టెక్నికల్ సమస్యలు, సర్వర్ సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వెంటనే ఐటీఆర్ దాఖలు చేయడం మంచిది.