Income Tax :రూ. 5,000 కోట్ల పన్ను చెల్లింపులకు నోటీస్.. రేసులో గూగుల్, అమెజాన్, ఆపిల్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో కార్పొరేట్, సాఫ్ట్ వేర్ కంపెనీ దిగ్గజాలు పన్ను చెల్లింపుల బకాయిలు ఎదుర్కొంటున్నాయి.
ఈ మేరకు ఆపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వ్యవహారంలో ఉన్నాయి.
పన్ను చెల్లించకపోవడంపై గూగుల్, ఆపిల్, అమెజాన్ లాంటి కంపెనీలు ఐటీ శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆయా కంపెనీలకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే ఆయా టాప్ కంపెనీలు దాదాపుగా రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ పన్ను చెల్లింపులు బకాయిలు పడ్డాయి.
2021లో ప్రారంభమైన విచారణకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు టెక్ దిగ్గజాల నుంచి వివరణలను కోరినట్లు నివేదిక సూచించింది.
DETAILS
ధరల తారుమారుని అరికట్టడం, పన్ను ఎగవేతను తగ్గించడం
ప్రధానంగా కార్పొరేట్ లావాదేవీల్లో ఏర్పడే ధరల తారుమారుని అరికట్టడం కారణంగా పన్ను ఎగవేతను తగ్గించేందుకు ఐటీ శాఖ భావిస్తోంది.
పన్నుకు సంబంధిత సంక్లిష్టతలను తగ్గించేందుకు, సమానమైన వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు కంపెనీలకు వారి కార్యాచరణ అధికార పరిధిలో బదిలీ ధరల చట్టాలను పాటించడం చాలా కీలకం.
అడ్వర్టైజ్‌మెంట్, మార్కెటింగ్, ప్రమోషన్ ఖర్చులు, రాయల్టీ చెల్లింపులు, ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెగ్మెంట్లు,అలాగే మార్కెటింగ్ సపోర్ట్ సర్వీసెస్‌కి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి మూడు టెక్నాలజీ కంపెనీల వ్యవహారాలను ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ట్రేడింగ్ విభాగాలకు సంబంధించిన ఖర్చుల వివరాలపై, ఆదాయపు పన్ను శాఖ కంపెనీ తిరస్కరించింది.
ఇలాంటివే వందలాది కోట్ల పన్నుల బకాయిలుగా ఆరోపణలకు దారితీసిందని ఐటీ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.