LOADING...
India-EU trade: త్వరలో భారత్‌తో ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం
త్వరలో భారత్‌తో ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం

India-EU trade: త్వరలో భారత్‌తో ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యమైన అమెరికా చేపడుతున్న దుందుడుకు, సాహసోపేత చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌-యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు వచ్చిన సమాచారం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. చాలాకాలంగా సాగిన చర్చలు, సంప్రదింపుల అనంతరం భారత్‌, ఈయూ మధ్య వాణిజ్య సయోధ్యకు మార్గం సుగమం అయ్యింది. త్వరలో సంతకాలు జరగనున్న ఈ ఒప్పందాన్ని 'మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌'గా అభివర్ణిస్తూ ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా ఫాన్‌ డెర్‌ లెయెన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన శీర్షికలుగా మారాయి.

వివరాలు 

భారత్‌, ఈయూ ఉత్పత్తులపై అమెరికా ఎడాపెడా సుంకాలు

అమెరికా అవలంబిస్తున్న ఒంటెత్తు వాణిజ్య విధానాలతో విసుగెత్తిన భారత్‌, ఈయూ పరస్పర లాభదాయక దిశగా ఒకే అభిప్రాయానికి రావడాన్ని వాణిజ్య వర్గాలు స్వాగతిస్తున్నాయి. టారిఫ్‌లను ఆయుధాల్లా వినియోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గతంలో భారత్‌, ఈయూ ఉత్పత్తులపై అమెరికా ఎడాపెడా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ భారాన్ని తప్పించుకునేందుకు, ప్రత్యామ్నాయ మార్గాల కోసం భారత్‌, ఈయూ వేగంగా ఈ ఒప్పందం దిశగా అడుగులు వేసినట్టు స్పష్టమవుతోంది. భారత్‌-ఈయూ ఒప్పందం కుదిరే అవకాశాలు బలపడుతున్నాయన్న వార్తలతో సహజంగానే ఈ ఒప్పందంలో ఉండబోయే అంశాలపై ఆసక్తి పెరిగింది. చారిత్రకంగా భారత్‌, ఈయూ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

రు పక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 135 బిలియన్‌ డాలర్ల స్థాయికి..

2024 నాటికి ఇరు పక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 135 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంది. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్‌ జీడీపీ వృద్ధి 7.3 శాతం వరకు ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేస్తోంది. మరోవైపు, ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక సమాఖ్యగా ఈయూ నిలుస్తోంది. 146 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌ ఈయూకు విశాలమైన మార్కెట్‌ను అందించగల సామర్థ్యం కలిగి ఉంది. అమెరికా, చైనా వంటి దేశాల ఒత్తిడులకు అతీతంగా పరస్పర ప్రయోజనాల ఆధారంగా వాణిజ్యాన్ని విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.

Advertisement

వివరాలు 

ఈయూలోని 27 దేశాలు భారతీయ వస్తువులు,సేవలకు మార్కెట్లు 

ప్రత్యేకంగా భారత్‌కు ఈ ఒప్పందం ద్వారా లభించే ప్రయోజనాలు అనేకంగా ఉన్నాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే, అమెరికాకు ఎగుమతి చేయలేక నిలిచిపోయిన సరుకులకు ఈయూ దేశాల్లో కొత్త అవకాశాలు లభించనున్నాయి. ఈయూలోని 27 దేశాలు భారతీయ వస్తువులు, సేవలకు తమ మార్కెట్లను విస్తృతంగా తెరవనున్నాయి. ముఖ్యంగా భారతీయ ఔషధ, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు ఈయూ పెద్ద వేదికగా మారనుంది. అమెరికా విధించిన టారిఫ్‌ల కారణంగా నష్టపోయిన భారతీయ టెక్స్‌టైల్‌, ఆభరణాలు, చర్మ ఉత్పత్తుల రంగాలకు ఈ ఒప్పందం ఊరటనివ్వనుంది. ప్రస్తుతం భారతీయ దుస్తులపై ఈయూ విధిస్తున్న 10 శాతం సుంకం తొలగే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

భారతీయ దుస్తులపై 10 శాతం సుంకం తొలగే అవకాశం