వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు
పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం భారతదేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను పెంచింది. అయితే ఈ వేసవితో పాటు రాబోయే రోజుల్లో దేశంలో రాత్రిపూట విద్యుత్ అంతరాయాలు పెరిగే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న బొగ్గు ఆధారిత, జలవిద్యుత్ కేంద్రాలు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు సరిపోకపోవచ్చు, సౌర శక్తి ఉపయోగం పగటిపూట పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను పరిష్కరించడంలో దేశానికి సహాయపడింది, అయితే విద్యుత్ వనరుల కొరత దేశంలో రాత్రిపూట విద్యుత్ అంతరాయాలను పెంచుతుంది. సెంట్రల్ గ్రిడ్ రెగ్యులేటర్ ప్రకారం ఏప్రిల్‌లో సౌర శక్తి లేని సమయాలలో భారతదేశం విద్యుత్ లభ్యత డిమాండ్ కంటే 1.7 శాతం తక్కువగా ఉంటుందని అంచనా.
ఫిబ్రవరిలోనే దేశంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
ఏప్రిల్‌లో రాత్రిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 217 గిగావాట్(GW)ల దాకా ఉండచ్చని అంచనా. ఫిబ్రవరిలోనే దేశంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవిలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఇప్పటికే సూచించింది. గ్రిడ్-ఇండియా నివేదిక తర్వాత, ప్రభుత్వం కొన్ని బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌లలో నిర్వహణ ప్రారంభించింది. విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు అదనపు గ్యాస్ ఆధారిత సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏప్రిల్‌లో 189.2 GW బొగ్గు ఆధారిత సామర్థ్యం అందుబాటులో ఉంటుందని గ్రిడ్-ఇండియా నోట్ సూచించింది, ఇది గత ఏడాది కంటే 11 శాతం ఎక్కువ. అయితే, బొగ్గు, అణు, గ్యాస్ సామర్థ్యం రాత్రిపూట గరిష్ట డిమాండ్‌లో 83 శాతం మాత్రమే చేరుకోగలవని అంచనా.