LOADING...
Gold Rates: పెళ్లిళ్ల సీజన్ ప్రభావం.. నేడు బంగారం, వెండి ధరలు ఇవే ..
పెళ్లిళ్ల సీజన్ ప్రభావం.. నేడు బంగారం, వెండి ధరలు ఇవే ..

Gold Rates: పెళ్లిళ్ల సీజన్ ప్రభావం.. నేడు బంగారం, వెండి ధరలు ఇవే ..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో బంగారంపై డిమాండ్ తగ్గే సూచనలు కనబడటం లేదు. నవంబర్ నెల మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పసిడి ధరలు మొత్తం 2.31% మేర పెరిగాయి. అయితే ప్రపంచ మార్కెట్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ మరింత బలపడటం,గ్లోబల్ ట్రేడ్‌ సంబంధిత అనిశ్చితి తగ్గుముఖం పట్టడం,అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు త్వరలో ఉండబోదన్న అంచనాలు.. ఈ అంశాలు అంతర్జాతీయంగా బంగారం ధరలను కొంత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం నవంబర్ 24 ఉదయం 6.30 నాటికి 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,583 గా ఉంది.

వివరాలు 

వచ్చే నెలలో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం

22 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.1,15,340 వద్ద నిలిచింది.వెండి విషయానికి వస్తే.. చిన్నతరహా తగ్గుదల కనిపించింది. నిన్నతో పోల్చితే కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,63,900 వద్దకు వచ్చింది. ఈ వారం కూడా పసిడి రేట్లు పెద్ద ఎత్తున మారే అవకాశం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ₹1,20,000 నుంచి ₹1,25,000 పరిధిలోనే ధరలు తిరుగాడవచ్చని భావిస్తున్నారు. వెండి రేట్లు కూడా ప్రస్తుతం ఉన్న స్థాయుల దగ్గరే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఇక వచ్చే నెలలో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం మార్కెట్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు లేని నేపథ్యంలో బంగారం ధరలపై ఇంకా ఒత్తిడి కొనసాగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

వివరాలు 

దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్ రేట్స్ (24కే, 22కే, 18కే) ఇవీ 

చెన్నై: ₹1,26,870; ₹1,16,290; ₹97,000 ముంబై: ₹1,25,830; ₹1,15,340; ₹94,370 న్యూ ఢిల్లీ: ₹1,25,980; ₹1,15,490; ₹94,520 కోల్‌కతా: ₹1,25,830; ₹1,15,340; ₹94,370 బెంగళూరు: ₹1,25,830; ₹1,15,340; ₹94,370 హైదరాబాద్: ₹1,25,830; ₹1,15,340; ₹94,370 విజయవాడ: ₹1,25,830; ₹1,15,340; ₹94,370 కేరళ: ₹1,25,830; ₹1,15,340; ₹94,370 పూణె: ₹1,25,830; ₹1,15,340; ₹94,370 వడోదరా: ₹1,25,880; ₹1,15,390; ₹94,420 అహ్మదాబాద్: ₹1,25,880; ₹1,15,390; ₹94,420

వివరాలు 

వెండి ధరలు 

చెన్నై: ₹1,71,900 ముంబై: ₹1,63,900 దిల్లీ: ₹1,63,900 కొల్కతా: ₹1,63,900 బెంగళూరు: ₹1,63,900 హైదరాబాద్: ₹1,71,900 విజయవాడ: ₹1,71,900 కేరళ: ₹1,71,900 పూణే: ₹1,63,900 వడోదరా: ₹1,63,900 అహ్మదాబాద్: ₹1,63,900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.