Loading...
Diesel and ATF Export Duty: డీజిల్‌, విమాన ఇంధనం ధరలపై ప్రభావం? కేంద్రం కీలక పన్ను నిర్ణయం
డీజిల్‌, విమాన ఇంధనం ధరలపై ప్రభావం? కేంద్రం కీలక పన్ను నిర్ణయం

Diesel and ATF Export Duty: డీజిల్‌, విమాన ఇంధనం ధరలపై ప్రభావం? కేంద్రం కీలక పన్ను నిర్ణయం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 17, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతులపై విధించే పన్నులను మరోసారి పెంచింది. డీజిల్‌పై లీటరుకు రూ.11.50గా ఉన్న ఎగుమతి సుంకాన్ని రూ.14కు, ఏటీఎఫ్‌పై రూ.11గా ఉన్న పన్నును రూ.12.50కు చేర్చింది. నవంబర్‌ 16 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మూడు వారాల్లోపే రెండోసారి పన్నులు పెరగడం గమనార్హం. అయితే పెట్రోల్‌ ఎగుమతులపై మాత్రం ఎలాంటి పన్ను విధించలేదు.

Details

అక్టోబర్‌ 31న కూడా పెరిగిన పన్నులు

అంతకుముందు అక్టోబర్‌ 31న కేంద్రం డీజిల్‌ ఎగుమతి పన్నును లీటరుకు రూ.8.50 నుంచి రూ.11.50కు పెంచింది.

ఏటీఎఫ్‌పై రూ.10.50 నుంచి రూ.11కు సవరించింది. పెట్రోల్‌ ఎగుమతులపై ఉన్న రూ.2.50 పన్నును పూర్తిగా తొలగించింది.

తాజాగా మరోసారి డీజిల్‌, ఏటీఎఫ్‌ పన్నులు పెంచడంతో ఈ ఇంధనాలను విదేశాలకు విక్రయించే సంస్థలపై అదనపు భారం పడనుంది.

అయితే ఈ మార్పులు కేవలం ఎగుమతులకు మాత్రమే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

Details

దేశీయంగా ఇంధన సరఫరాకు ప్రాధాన్యం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూడటమే ఈ నిర్ణయాల వెనుక ప్రధాన ఉద్దేశం.

2026 మార్చి 27న తొలిసారిగా పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై కేంద్రం సుంకాలు విధించింది.

ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయంగా ముడిచమురు, పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ ధరలను పరిశీలించి పన్నులను సవరిస్తోంది.

దేశీయ అవసరాలకు ఇంధనం అందుబాటులో ఉండేలా ఎగుమతులను నియంత్రించడం ఈ విధానం లక్ష్యం.

ADVERTISEMENT

Details

భారత్‌పై పశ్చిమాసియా పరిణామాల ప్రభావం

భారత్‌ ముడిచమురు అవసరాల్లో గణనీయమైన భాగం విదేశీ దిగుమతులపైనే ఆధారపడి ఉంది.

పశ్చిమాసియాలో సంక్షోభానికి ముందు మన చమురు దిగుమతుల్లో దాదాపు సగం హార్ముజ్‌ జలసంధి మీదుగా వచ్చేవి.

అక్కడ నౌకాయానానికి ఆటంకాలు ఏర్పడటంతో భారత్‌ ఇతర దేశాల నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది.

2026 మార్చి నుంచి జూన్‌ మధ్య రష్యా నుంచి వచ్చిన ముడిచమురు వాటా 39 శాతానికి చేరింది.

గత ఏడాది ఇదే సమయంలో అది 32 శాతంగా ఉంది. మరోవైపు సౌదీ అరేబియా సరఫరాలకు ఆటంకాలు ఎదురవగా, ఇరాక్‌ వాటా 18 శాతం నుంచి 3 శాతానికి పడిపోయింది. ఇ

ADVERTISEMENT