Loading...
Sunil Bharti Mittal: భారత్‌ చేతిలోనే శాటిలైట్‌ కిల్‌ స్విచ్‌ ఉండాలి: సునీల్‌ మిత్తల్
భారత్‌ చేతిలోనే శాటిలైట్‌ కిల్‌ స్విచ్‌ ఉండాలి: సునీల్‌ మిత్తల్

Sunil Bharti Mittal: భారత్‌ చేతిలోనే శాటిలైట్‌ కిల్‌ స్విచ్‌ ఉండాలి: సునీల్‌ మిత్తల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్లపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని భారతీ ఎయిర్‌ టెల్‌ వ్యవస్థాపకుడు,ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ అభిప్రాయపడ్డారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసే లేదా నియంత్రించే 'కిల్‌ స్విచ్‌' మన దేశం చేతిలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఈ నియంత్రణ విదేశీ సంస్థల చేతుల్లో ఉంటే భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరోక్షంగా హెచ్చరించారు. భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించే విషయంలో ఇటీవల స్పేస్‌-X అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

వివరాలు 

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన సునీల్‌ మిత్తల్

ఈ నేపథ్యంలో సునీల్‌ మిత్తల్‌ తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు.

భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రభుత్వం శాటిలైట్‌ ఆపరేటర్లకు అనుమతులు ఇచ్చే ముందు భద్రతాపరమైన అంశాలను పరిశీలించడాన్ని ఆయన సమర్థించారు.

ప్రస్తుతం ఆధునిక యుద్ధాలు భూమికే పరిమితం కావడం లేదని, అంతరిక్షం వరకూ విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.

డ్రోన్లు, సైబర్‌ దాడులు, గైడెడ్‌ మిస్సైళ్లు వంటి వాటి కార్యకలాపాలను కూడా అంతరిక్ష సాంకేతికత ద్వారా నియంత్రించే పరిస్థితులు ఉన్నాయని వివరించారు.

వివరాలు 

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం భారత్‌ ఒకే సంస్థపై ఆధారపడకూడదు 

ప్రపంచంలోని ప్రతి దేశానికి తన భద్రతకు సంబంధించిన కీలక వ్యవస్థలపై నియంత్రణ ఉండాలని మిత్తల్‌ అన్నారు.

అందుకే ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్లను నిలిపివేసే లేదా నియంత్రించే కిల్‌ స్విచ్‌ భారత్‌ పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు.

ఈ అధికారం విదేశాల్లోని సంస్థల చేతుల్లో ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, ఎలాన్‌ మస్క్‌ సంస్థను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం భారత్‌ ఒకే సంస్థపై ఆధారపడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ రంగంలో పోటీతో పాటు సేవలను అందించే విభిన్న సంస్థలు ఉండటం అవసరమని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

కిల్‌ స్విచ్‌ అంటే ఏమిటి?

సాంకేతిక పరిభాషలో కిల్‌ స్విచ్‌ అంటే శాటిలైట్‌ నెట్‌వర్క్‌ సేవలను పూర్తిగా నిలిపివేయడం,వాటి వేగాన్ని తగ్గించడం లేదా నిర్దిష్ట ప్రాంతాల్లో సేవలను పరిమితం చేయడం వంటి పనులకు ఉపయోగించే నియంత్రణ వ్యవస్థ.

సాధారణంగా శాటిలైట్‌ నెట్‌వర్క్‌ను నిర్వహించే సంస్థలు తమ కంట్రోల్‌ సిస్టమ్స్‌, గ్రౌండ్‌ గేట్‌వేల ద్వారా ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి.

శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో వినియోగదారుల టెర్మినల్స్‌ ఉపగ్రహాలకు అనుసంధానమవుతాయి.

ఆ ఉపగ్రహాలు సమాచారాన్ని భూమిపై ఉన్న గ్రౌండ్‌ స్టేషన్లకు చేరవేస్తాయి. అక్కడి నుంచి డేటా ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌లోకి వెళ్తుంది.

ఈ మొత్తం వ్యవస్థలో కంట్రోల్‌ సిస్టమ్స్‌, గ్రౌండ్‌ గేట్‌వేలను నిర్వహించే సంస్థకు సేవలపై కీలకమైన అధికారం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

భద్రతాపరమైన సాధనంగా కిల్‌ స్విచ్

దీంతో అవసరమైనప్పుడు వినియోగదారులకు అందించే సేవలను నిలిపివేయడం, వాటిని పరిమితం చేయడం లేదా డేటా ప్రయాణించే మార్గాన్ని మార్చడం సాధ్యమవుతుంది.

సులభంగా చెప్పాలంటే.. శాటిలైట్‌ నెట్‌వర్క్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయడంతో పాటు దాని సేవలను నియంత్రించే అధికారం కలిగి ఉండటాన్నే కిల్‌ స్విచ్‌గా పిలుస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను కీలకమైన భద్రతా సాధనంగా పరిగణిస్తోంది. కిల్‌ స్విచ్‌ భారత్‌ నియంత్రణలో ఉంటే అత్యవసర పరిస్థితుల్లో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను అవసరానికి అనుగుణంగా నిలిపివేయడం లేదా పరిమితం చేయడం సాధ్యమవుతుందని భావిస్తోంది.

అదే అధికారం విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల చేతుల్లో ఉంటే దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలపై భారత్‌ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

భద్రతాపరమైన సాధనంగా కిల్‌ స్విచ్

ఈ భద్రతాపరమైన అంశాలపై జరుగుతున్న పరిశీలనల కారణంగా దేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతోంది.

ఈ పరిణామాలపై ఇటీవల ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. తమ స్టార్‌లింక్‌ సేవలను భారత్‌లోకి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో సునీల్‌ మిత్తల్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ADVERTISEMENT