LOADING...
GST collections: జులై జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు..7.5 శాతం వృద్ధి
జులై జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు..7.5 శాతం వృద్ధి

GST collections: జులై జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు..7.5 శాతం వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూలై నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయి. ఈ నెలలో మొత్తం రూ.1.96 లక్షల కోట్లు వసూలు కాగా, ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ.1.82 లక్షల కోట్లుతో పోల్చితే 7.5 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇటీవలి నెలల్లో జీఎస్టీ ఆదాయాలు రూ.1.8 లక్షల కోట్లకు మించి స్థిరంగా నమోదు అవుతూ వస్తుండటం విశేషం. ఈ స్థాయిలో వసూళ్లు రావడం వరుసగా ఏడు నెలలుగా కొనసాగుతుండటం గమనార్హం. 2025 ఏడాది ఏప్రిల్‌లో ఇప్పటివరకు అత్యధికంగా రూ.2.37 లక్షల కోట్లు వసూలయ్యాయి. తరువాత జూన్‌లో ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జులై జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు