జయహో భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానం
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు భారత స్థూల దేశీయోత్పత్తి (GROSS DOMESTIC PRODUCT)లో తొలి త్రైమాసికం Q1లో 7.8 శాతంగా నిలిచింది. గతేడాది ఇదే సమయంలో భారత వృద్ధి శాతం 6.1 శాతంగా నిలిచింది. ఈసారి అనూహ్యంగా భారీ స్థాయిలో పుంజుకోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా భారత్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. మరోవైపు ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో చైనా కేవలం 6.3 శాతం వృద్ధినే నమోదు చేయగలిగింది. మరోవైపు ఇండోనేషియా 5.17 శాతం, రష్యా 4.9 శాతం, అమెరికా 2.1 శాతం,జపాన్ 2 శాతం,దక్షిణ కొరియా 0.9 శాతం, యూకే 0.4 శాతం, జర్మనీ -0.2 శాతం, నెదర్లాండ్స్ -0.3 శాతంతో ఉన్నాయి.