LOADING...
Railway Luggage rules: రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్ట్‌ లాంటి లగేజీ తనిఖీ!
రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్ట్‌ లాంటి లగేజీ తనిఖీ!

Railway Luggage rules: రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్ట్‌ లాంటి లగేజీ తనిఖీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైళ్లలో ప్రయాణించే వ్యక్తుల లగేజీపై నియమాలు ఎప్పటి నుంచో అమలులో ఉన్నాయి. ఒక్కో ప్రయాణికుడు ఎంచుకున్న టికెట్ తరగతిని ఆధారంగా నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే లగేజీ తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. అయితే,ప్రస్తుతం రైల్వే స్టేషన్లలోని మౌలిక సౌకర్యాల పరిమితుల వల్ల ఈ నియమాలు సరిగ్గా సరిగా అమలు కావడం లేదు. అందువల్ల రైల్వే శాఖ ఈ లగేజీ నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై, విమానాశ్రయాల తరహా విధానంలో,రైలు స్టేషన్లలోనూ లగేజీ తనిఖీ చేయనుంది. ప్రారంభ దశలో ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఈ కఠినమైన లగేజీ తనిఖీ విధానం అమలు కానుందని రైల్వే వర్గాలు తెలిపారు. ప్రయాణికులు అక్కడ ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం (ఈస్కేలో ఎస్‌కేల్)పై తమ బ్యాగ్‌ను ఉంచాలి.

వివరాలు 

లగేజీపై పరిమితి ఎంత? 

ఒకవేళ పరిమితికి మించి లగేజీ తీసుకెళుతున్నట్లు గుర్తిస్తే.. అదనపు రుసుము లేదా పెనాల్టీ విధించబవచ్చు. రైల్వే శాఖ, ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతోనే ఈ నియమాలను కఠినంగా అమలు చేయాలనుకుంటోంది. ప్రతి ప్రయాణికుడు తమ టికెట్ తరగతిని ఆధారంగా నిర్దిష్ట పరిమితి వరకు ఉచితంగా లగేజీ తీసుకెళ్లవచ్చు: ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ: గరిష్ఠంగా 70 కిలోల వరకు ఏసీ 2-టైర్: 50 కిలోల వరకు ఏసీ 3-టైర్ & స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు సెకండ్‌ క్లాస్: 35 కిలోల వరకు అదనపు లగేజీ తీసుకెళ్ళాలనుకునే ప్రయాణికులు, రైలు బయల్దేరే ముందు కనీసం 30 నిమిషాల ముందు లగేజీ కౌంటర్‌ను సంప్రదించడం మంచిది.