Indian rupee: USDతో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి
రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గింది. మంగళవారం (డిసెంబర్ 10) ప్రారంభ ట్రేడింగ్‌లో 84.75 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, 9 పైసలు క్షీణించి 84.83 కు చేరుకుంది. బ్యాంకర్లు, దిగుమతి దారుల నుంచి యూఎస్ డాలర్ పట్ల పెరుగుతున్న డిమాండ్ వల్ల రూపాయి విలువ కనిష్టస్థాయికి పడిపోయింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నియామకానికి తర్వాత దేశీయ కరెన్సీ అతి తక్కువ స్థాయికి చేరుకుంది. రూపాయి ఇంట్రాడే ట్రేడింగ్‌లో గరిష్టంగా 84.85, కనిష్టంగా 84.80 వద్ద నమోదు అయ్యింది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఈక్విటీ మార్కెట్ పుంజుకోవడం మరియు ఇతర ప్రపంచ కరెన్సీలతో డాలర్ స్థిరంగా ఉండటంతో రూపాయి బలహీనపడిందని ఫారెక్స్ మార్కెట్ డీలర్లు పేర్కొంటున్నారు.