జనవరి-మార్చి త్రైమాసికంలో 9,400మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
గత ఏడాది నుంచి నెలకొన్ని ఆర్థిక అనిశ్చితి ఐటీ రంగానికి శరాఘాతంగా మారింది. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి.
ముఖ్యంగా ఫండింగ్ మీద ఆధారపడ్డ భారతీయ స్టార్టప్‌లలో లేఆఫ్స్ మరింత ఎక్కువయ్యాయి.
భారతదేశంలోని స్టార్టప్‌లు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలోనే దాదాపు 9,400 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
స్టార్టప్ ఫండింగ్ తగ్గడమే దీనికి కారణంగా తెలుస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో స్టార్టప్ ఫండింగ్ ఏకంగా 71.6శాతం తగ్గడం గమనార్హం.
ఉద్యోగుల తొలగింపు
70శాతం ఉద్యోగులను తొలగింపు
భారతదేశంలో స్టార్టప్ ఫండింగ్ గత సంవత్సరంలో గణనీయంగా తగ్గింది.
2023 జనవరి-మార్చి కాలంలో దేశంలో స్టార్టప్‌లు 3.4 బిలియన్ డాలర్లను సేకరించాయి.
ఇది గతేడాది కంటే 71.6శాతం తక్కువ. దీంతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా లేఆఫ్స్ చేపట్టింది.
మొత్తం స్టార్టప్‌లలో దాదాపు 70శాతం ఉద్యోగులను తొలగించబడ్డారు. BYJU'S, Uncademy, Swiggy, Ola, Polygonతో సహా భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ స్టార్టప్‌లు ఉద్యోగులను తొలగించిన సంస్థల జాబితాలో ఉన్నాయి.
అయితే తొలగింపులు ఇంకా కొనసాగవచ్చని నిపుణులు, పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. అలాగే సీనియర్ ఉద్యోగుల నియామకాలు మార్చి త్రైమాసికంలో 80శాతం తగ్గాయి.