Stock Market: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం..ఒడిదొడుకుల్లో భారత స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార వేళ, మదుపర్లు ఆచితూచి స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఒక దశలో సెన్సెక్స్ 125 పాయింట్లకు పైగా ఎగిసిపోతే, ఆ తర్వాత మళ్లీ పడిపోయింది.
ప్రస్తుతం ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 76,635 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ ప్రారంభంలో లాభాలతో 23,250 మార్క్‌ను తాకినా, కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్ళింది. ఇది ప్రస్తుతం 15 పాయింట్ల నష్టంతో 23,186 వద్ద ఉంది.
వివరాలు
లాభాలలో బ్యాంకింగ్ షేర్లు
బ్యాంకింగ్ షేర్లు లాభాలను కొనసాగిస్తున్నాయి. కోటక్ మహీంద్రా, ఎస్‌బీఐ, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫినాన్స్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉన్నాయి.
అయితే శ్రీరామ్ ఫినాన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.