Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల కారణంగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది.
వాణిజ్య యుద్ధ భయాలతో వరుస నష్టాల్లోకి జారుకున్న సూచీలు ప్రస్తుతం లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.
మార్కెట్ ప్రారంభంలోనే నిఫ్టీ 23,100 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టగా, సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.
ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 75,142 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు తగ్గి 23,024 వద్ద కొనసాగింది.
Details
స్వల్ప నష్టాలతో డోజోన్స్
కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, జొమాటో, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
టెక్‌మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.85 వద్ద కొనసాగుతుండగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 74.46 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ఔన్సు ధర 2,942.50 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్ సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 500, డోజోన్స్ స్వల్ప నష్టాలతో ముగియగా, నాస్‌డాక్ ఫ్లాట్‌గా ముగిసింది.
Details
లాభాల్లో ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు
ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.20%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.45%, జపాన్ నిక్కీ 1.30% లాభంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు
బుధవారం నికరంగా రూ.4,969 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.5,929 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.