LOADING...
Infosys: ఐటీ రంగంలో ఒత్తిడి.. టాప్-10 నుంచి ఇన్ఫోసిస్ ఔట్.. AI ప్రభావమా?
ఐటీ రంగంలో ఒత్తిడి.. టాప్-10 నుంచి ఇన్ఫోసిస్ ఔట్.. AI ప్రభావమా?

Infosys: ఐటీ రంగంలో ఒత్తిడి.. టాప్-10 నుంచి ఇన్ఫోసిస్ ఔట్.. AI ప్రభావమా?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్(Infosys)ఈసారి టాప్-10 అత్యంత విలువైన కంపెనీల జాబితా నుంచి తప్పుకుంది. ఈ ఏడాది షేర్ ధరలు గణనీయంగా పడిపోవడంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్ల మేర తగ్గింది. ఏప్రిల్ 29న షేర్ ధర దాదాపు రూ.1,175 వద్ద ట్రేడ్ కాగా,మార్కెట్ క్యాప్ రూ.4.76లక్షల కోట్లకు పరిమితమై కంపెనీ 11వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు షేర్లు సుమారు 29% తగ్గడం గమనార్హం. 2025 చివర్లో రూ.6.8లక్షల కోట్లకు పైగా ఉన్న విలువ ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో Life Insurance Corporation of India (LIC) దాదాపు రూ.5.19 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఇన్ఫోసిస్ స్థానాన్ని దక్కించుకుంది.

వివరాలు 

ఐటీ రంగంలో కొనసాగుతున్న బలహీనత

ఐటీ రంగంలో కొనసాగుతున్న బలహీనత ఇన్ఫోసిస్ పతనంలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కూడా ఒత్తిడితో టాప్-5 జాబితా నుంచి తప్పుకుంది. మార్కెట్‌లో ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. పెట్టుబడిదారులు ప్రస్తుతం జాగ్రత్తగా వ్యవహరిస్తుండగా, సమీప కాలంలో ఈ రంగంలో భారీ వృద్ధి ఆశలు తగ్గినట్లే కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు మాత్రం ఆశించిన దానికంటే మెరుగ్గా వచ్చాయి. కంపెనీ రూ.46,402 కోట్ల ఆదాయం, రూ.8,501 కోట్ల లాభం నమోదు చేసింది. అయితే, భవిష్యత్ వృద్ధి అంచనాను 1.5% నుంచి 3.5% మధ్యగా సూచించడం నెమ్మదిగా పెరుగుదల సంకేతంగా భావిస్తున్నారు. పెద్ద డీల్‌లు కూడా గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

వివరాలు 

సంప్రదాయ ఐటీ సేవలకు తగ్గుతున్న డిమాండ్ 

ఇక ఈ పతనానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) కారణమా అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. కంపెనీలు వేగంగా AI,ఆటోమేషన్ వైపు మొగ్గుచూపుతుండటంతో సంప్రదాయ ఐటీ సేవలకు డిమాండ్ తగ్గుతోంది. క్లయింట్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిని కోరడం వల్ల ఐటీ కంపెనీల ఆదాయంపై ఒత్తిడి పెరిగింది. ఇన్ఫోసిస్ కూడా AI ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తున్నప్పటికీ, దాని పూర్తి ప్రయోజనం ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, జియోపాలిటికల్ ఉద్రిక్తతల కారణంగా విదేశీ క్లయింట్లు ఖర్చులను తగ్గిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు కూడా మందగించడంతో ఐటీ కంపెనీల వృద్ధిపై ప్రభావం పడుతోంది. లాభాలు పెరిగినా, తక్కువ వృద్ధి అంచనాలు పెట్టుబడిదారులను జాగ్రత్తపడేలా చేస్తున్నాయి. దీంతో ఐటీ షేర్లలో ఊగిసలాట మరింత పెరుగుతోంది.

Advertisement