LOADING...
NSE: ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి 

NSE: ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) కొత్త ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఇంజేటి శ్రీనివాస్‌ను నియమితులయ్యారు. శ్రీనివాస్ ఒడిశా క్యాడర్‌కు చెందిన 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శిగా, క్రీడా విభాగ కార్యదర్శిగా, అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (IFSC Authority - ఐఎఫ్‌ఎస్‌సీఏ)కి తొలి ఛైర్‌పర్సన్‌ లాంటి పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ మధ్యనే శ్రీనివాస్ ఎన్‌ఎస్‌ఈ బోర్డు సభ్యుడిగా పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కాగా, గత రెండు సంవత్సరాలుగా ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు ఎన్‌ఎస్‌ఈ సిద్ధమవుతోంది. ఇలాంటి కీలక సమయంలో, శ్రీనివాస్ ని ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌గా నియమించడం విశేష ప్రాధాన్యతను పొందింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

NSE ఇండియా చేసిన ట్వీట్