Page Loader
IPO: భారత స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించనున్న ఐపీఓలు.. ఈ ఏడాది పెట్టుబడుల మహోత్సవం
భారత స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించనున్న ఐపీఓలు.. ఈ ఏడాది పెట్టుబడుల మహోత్సవం

IPO: భారత స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించనున్న ఐపీఓలు.. ఈ ఏడాది పెట్టుబడుల మహోత్సవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

కోటక్ క్యాపిటల్ అంచనా ప్రకారం ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా 35 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3 లక్షల కోట్లు) సమీకరించే ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో కంపెనీలు సమీకరించిన 22 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.8 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి అని పేర్కొంది. 2025లో ఆర్థిక సేవల రంగం నుంచి అత్యధికంగా 9 బిలియన్ డాలర్లు (రూ.76,500 కోట్లు) విలువైన ఐపీఓలు రావచ్చని అంచనా ఉంది. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ఈకామ్ ఎక్స్‌ప్రెస్, జెప్టో, పెప్పర్‌ఫ్రై వంటి కంపెనీలు 5 బిలియన్ డాలర్లు (రూ.42,500 కోట్లు) సమీకరించవచ్చని తెలిపింది.

Details

రూ.314 కోట్ల సమీకరణ

కోటక్ క్యాపిటల్ ప్రకారం కంపెనీల ఐపీఓ పరిమాణాలు స్థిరంగా పెరుగుతుండగా, భవిష్యత్తు పెట్టుబడుల కోసం పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలని చూసే కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోంది. 2024లో వచ్చిన 91 ఐపీఓల సగటు లిస్టింగ్ లాభాలు 32.8 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. అంతేకాకుండా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు సెకండరీ మార్కెట్ కంటే ఐపీఓలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని వివరించింది. లక్ష్మీ డెంటల్ ఐపీఓ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఐపీఓకు ముందు, లక్ష్మీ డెంటల్ యాంకర్ మదుపర్ల నుంచి రూ.314 కోట్ల నిధులను సమీకరించింది.

Details

జనవరి 13 నుంచి 15 వరకు ఐపీఓ

ఈ నిధులను 31 సంస్థలకు ఒక్కో షేరు రూ.428 చొప్పున 73.39 లక్షల షేర్లను కేటాయించడం ద్వారా పొందింది. లక్ష్మీ డెంటల్ ఐపీఓ జనవరి 13 నుండి 15 తేదీల వరకు జరుగుతుంది. ధరల శ్రేణి రూ.407-428గా నిర్ణయించారు. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.138 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా ప్రమోటర్ల 1.31 కోట్ల షేర్లను విక్రయించి రూ.560 కోట్లను సమీకరించనుంది.