Loading...
Iran: హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ షరతులు.. చమురు ధరల్లో భారీ పతనం
హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ షరతులు.. చమురు ధరల్లో భారీ పతనం

Iran: హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ షరతులు.. చమురు ధరల్లో భారీ పతనం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరిచేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు అమెరికా ముందుగా తన సైనిక ఒత్తిడిని తగ్గించాలని ఇరాన్ షరతు పెట్టినట్లు జపాన్‌కు చెందిన క్యోడో న్యూస్‌ తెలిపింది. ఈ విషయాన్ని ఓ సీనియర్ ఇరాన్ ప్రభుత్వ అధికారి మంగళవారం వెల్లడించినట్లు పేర్కొంది. అమెరికాతో దౌత్యపరమైన చర్చలను మళ్లీ ప్రారంభించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఈ ప్రతిపాదనను అమెరికాకు చేరవేసినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు శాశ్వతంగా ముగింపు పలికేలా కొత్త చర్చలు ప్రారంభించాలని కూడా ఇరాన్ కోరినట్లు తెలుస్తోంది.

వివరాలు 

యూఎన్‌ వేదికగా దౌత్య ప్రయత్నాలు.. న్యూయార్క్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు

ఈ వారం న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశాన్ని దౌత్యపరమైన చర్చలకు వేదికగా ఉపయోగించుకోవాలని టెహ్రాన్ భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

మధ్యవర్తిత్వం చేస్తున్న దేశాలతో ఈ సందర్భంగా సంప్రదింపులు జరపాలని ఇరాన్ యోచిస్తోంది.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోమవారం న్యూయార్క్‌కు బయలుదేరారు.

81వ యూఎన్‌ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.

అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే ఆయన పర్యటన సాగుతోంది.

ఇదే సమయంలో ఇరాన్ ప్రతినిధి బృందంలోని కొందరికి వీసాల విషయంలో వివాదం కూడా నెలకొంది.

పెజెష్కియాన్ సెప్టెంబర్ 23న జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. సమావేశాల సందర్భంగా పలువురు విదేశీ నేతలు, అధికారులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.

వివరాలు 

ట్రంప్‌తో పెజెష్కియాన్ భేటీ ఉండదు

ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మధ్య భేటీ జరిగే అవకాశం లేదని ఇరాన్ అధికారి స్పష్టం చేసినట్లు క్యోడో న్యూస్‌ పేర్కొంది.

అయితే అమెరికా తమతో చర్చలకు తిరిగి రావడానికి నిజమైన ఆసక్తి, నిబద్ధత చూపిస్తే దౌత్యపరంగా ముందడుగు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అమెరికా చర్చలకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉందన్నహామీతో పాటు,ఇరాన్ నౌకాశ్రయాలపై కొనసాగుతున్న సైనిక దిగ్బంధనాన్ని సడలించాలని టెహ్రాన్ కోరుతోంది.

అలాగే హర్ముజ్ జలసంధికి సంబంధించిన సైనిక చర్యలను నిలిపివేయాలని కూడా ఇరాన్ డిమాండ్ చేస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.

ఈ ప్రతిపాదనకు సంబంధించిన వార్తలు వెలువడటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరలు భారీగా పడిపోయాయి.

ADVERTISEMENT

వివరాలు 

సైనిక ఒత్తిడితో పాటు దౌత్యం

ఇరాన్ ఒక వారంలో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉందన్న సమాచారం నేపథ్యంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 91 డాలర్ల దిగువకు పడిపోయింది.

కొద్ది రోజుల క్రితమే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఖాలిబాఫ్ హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ప్రకటించారు.

ఇరాన్ డిమాండ్లను అంగీకరించి, అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు జలసంధిని తెరవబోమని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

సైనిక ఒత్తిడితో పాటు దౌత్యం

ఇరాన్ తన సైనిక ఒత్తిడిని కొనసాగిస్తూనే దౌత్యపరమైన ప్రయత్నాలను కూడా ముందుకు తీసుకెళ్తుందని ఖాలిబాఫ్ తెలిపారు.

తమకు అనుకూలమైన షరతులతో ఘర్షణకు ముగింపు పలకడానికి ఈ రెండు మార్గాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

''మనం పోరాడాలి.. అదే సమయంలో చర్చలు కూడా జరపాలి'' అని ఆయన గతంలో వ్యాఖ్యానించారు.

యుద్ధరంగంలో సాధించిన ప్రయోజనాలను కాపాడుకునేందుకు సైనిక సామర్థ్యాలను ఉపయోగిస్తూనే, వాటిని దౌత్యం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఇరాన్ భావిస్తున్నట్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT