Israel McDonalds : ఇజ్రాయెల్ మెక్‌డొనాల్డ్స్ నిర్ణయంతో అరబ్ దేశాల్లో ఆగ్రహజ్వాలలు
అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ తీసుకున్న ఓ నిర్ణయంపై అరబ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ సైనికులకు ఫ్రీగా ఆహారాన్ని అందిస్తామని ఇజ్రాయెల్ ఫ్రాంఛైజీ చేసిన ప్రకటనపై సౌదీ అరేబియా ఫ్రాంఛైజీ స్పందించింది. అది ఇజ్రాయెల్ ఫ్రాంఛైజీ వ్యక్తిగత విషయమని పేర్కొంది. జోర్డాన్, టర్కీ, సౌదీ అరేబియాలో ఉన్న కంపెనీ ప్రాంఛైజీలు కూడా ఇదే విధంగా స్పందిచాయి. దాదాపుగా 4,000 ఆహార ప్యాకెట్లను ఉచితంగా ఇజ్రాయెల్ సైనికులకు అందించాలని నిర్ణయించింది. ఇతర ఆహార పదార్థాలపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ శాఖ ఫ్రాంచైజీ నుంచి వైదొలిగింది. ఇజ్రాయెల్ మెక్‌డొనాల్డ్ నిర్ణయంతో లెబనాన్‌లో నిరసనలు భారీగా మొదలయ్యాయి.