Page Loader
ITR filing date: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగించిన కేంద్రం.. సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం 
ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగించిన కేంద్రం.. సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం

ITR filing date: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగించిన కేంద్రం.. సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సంబంధిత అంశంలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలుకు గడువును విస్తరించేలా నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన విధంగా ఈ గడువు 2025 జూలై 31న ముగియాల్సి ఉండగా, తాజాగా సెప్టెంబర్ 15 వరకు టాక్స్ పేయర్స్ కు అవకాశం కల్పించినట్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంగా, ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్ జారీ ఆలస్యమవ్వడం పేర్కొంది. ఈ ఆలస్యం నేపథ్యంలోనే రిటర్ను దాఖలుకు గడువు పొడిగిస్తున్నట్టు ఐటీ శాఖ తెలియజేసింది.

వివరాలు 

ప్టెంబర్ 15 వరకు గడువు పొడిగింపు 

''2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో కొన్ని మార్పులు చేపట్టాం. వాటికి అనుగుణంగా మా సిస్టంను అప్డేట్ చేయడానికి కొంత సమయం అవసరం అవుతోంది. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐటీఆర్ దాఖలు చేయగలిగేలా, జూలై 31తో ముగియనున్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నాం'' అని ఆదాయపు పన్ను శాఖ తన అధికారిక ఎక్స్ (గతం లో ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది. అదే సమయంలో, దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను వేరుగా త్వరలో విడుదల చేస్తామని కూడా వివరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆదాయపు పన్ను శాఖ చేసిన ట్వీట్