Page Loader
Jio Financial: జియో ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ జిఓ బ్లాక్‌ రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు సెబీ ఆమోదం
జియో ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ జిఓ బ్లాక్‌ రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు సెబీ ఆమోదం

Jio Financial: జియో ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ జిఓ బ్లాక్‌ రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు సెబీ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) అనుబంధ సంస్థకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుండి అనుమతి లభించిందని మంగళవారం ప్రకటించింది. జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ పేరిట సేవలు అందించేందుకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ అనుమతితో సంబంధించి మే 26న జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సెబీ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జారీ చేసినట్లు జేఎఫ్‌ఎస్‌ఎల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది.

వివరాలు 

మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి జియో ఫైనాన్షియల్,బ్లాక్‌రాక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కి మార్గం సుగమమైంది

ఇప్పటికే జియో ఫైనాన్షియల్, అమెరికాలో స్థాపితమైన బ్లాక్‌రాక్ కలిసి జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్,జియో బ్లాక్‌రాక్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉమ్మడి ప్రాజెక్టులో ఇరుపార్టీలకు తలో 50 శాతం వాటా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో మొత్తం రూ.117 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు జియో ఫైనాన్షియల్ ఈ ఏడాది జనవరిలో వెల్లడించింది. 2023 అక్టోబర్‌లోనే జియో ఫైనాన్షియల్, బ్లాక్‌రాక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సంస్థలు కలిసి మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాల అనుమతికి సెబీకి దరఖాస్తు చేశాయి. తాజాగా అనుమతులు లభించడంతో, మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.