
Jio Star: జియోస్టార్ లాంచ్.. కేవలం రూ. 15కే అదిరే ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
రిలయెన్స్ జియో వయాకామ్ 18, డిస్ని హాట్ స్టార్ విలీన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఈ విలీనంతో కంపెనీ ఇటీవల కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ నూతన వెబ్‌సైట్ భారతదేశంలోని రెండు అత్యంత ప్రజాదరణ పొందిన ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌పారమ్‌లు జియో సినిమా, జియో హాట్‌స్టార్ ఉమ్మడి ఫ్లాట్‌ఫారమ్.
తాజాగా జియో స్టార్ వెబ్‌సైట్‌లో ప్యాక్‌ల జాబితాను రిలీజ్ చేశారు. అయితే కంపెనీ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లను రెండు వర్గాలుగా విభజించింది.
హిందీ ప్యాక్‌లు
వాల్యూ ప్యాక్: రూ. 59
ప్రీమియం ప్యాక్: రూ. 105
Details
తెలుగు ప్యాక్‌లు
వాల్యూ ప్యాక్: రూ. 81
మినీ ప్యాక్: రూ. 70
డిస్నీ కిడ్స్ ప్యాక్: రూ. 15
హిందీ HD ప్యాక్‌లు
లైట్ వాల్యూ ప్యాక్: రూ. 88
ప్రీమియం లైట్ ప్యాక్: రూ. 125
డిస్నీ కిడ్స్ HD ప్యాక్‌లు: రూ. 18
Details
విభిన్న భాషల్లో కంటెంట్
రూ. 15 నుంచి ప్రారంభమయ్యే సర్వీస్ ప్లాన్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
హాట్ స్టార్‌కు 36.84%, వయాకామ్ 18కు 16.34% వాటా ఉంది. చైర్‌పర్సన్ నీతా అంబానీ నేతృత్వంలో జియో స్టార్ తన సేవలను గ్రామీణ ప్రాంతాలకు, అట్టడుగు వర్గాలకు విస్తరించడంపై దృష్టి సారించింది.
ఈ భాగస్వామ్యం భారత OTT మార్కెట్‌ను విప్లవాత్మకంగా మార్చనుందని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు.
జియో స్టార్ విభిన్న భాషల్లో కంటెంట్‌ను అందించడంతో పాటు, తక్కువ ధరలు, ఎక్కువ విలువ అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.