Page Loader
Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు
రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు

Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఆభరణాల రంగంలో ప్రముఖంగా ఉన్న లలితా జువెలరీ మార్ట్ త్వరలోనే తన మొదటి పబ్లిక్ ఇష్యూకు (IPO) రంగం సిద్ధం చేస్తోంది. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా సంస్థ సుమారుగా రూ.1700 కోట్లను సమీకరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI)కు తగిన ప్రాథమిక పత్రాలు (డ్రాఫ్ట్ రెడ్ హేరింగ్ ప్రాస్పెక్టస్) దాఖలు చేసింది. ఈ ఐపీఓలో భాగంగా, లలితా జువెలరీ రూ.1200 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాదు, ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ స్వాధీనంలోని షేర్లను రూ.500 కోట్ల విలువకు విక్రయించనున్నారు.

Details

దక్షిణ భారతంపై దృష్టి… 56 స్టోర్లు 

లలితా జువెలరీకి చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో సంస్థకు మొత్తం 56 రిటైల్ విక్రయశాలలున్నాయి. 2022 నుంచి 2024 మధ్యకాలంలో కంపెనీ ఆదాయాలు సంవత్సరానికి సగటున 43.62 శాతం పెరుగుదలతో అభివృద్ధి చెందాయి. అయితే సంస్థపై కొంత మేర రుణ భారం కూడా ఉన్నదని సమాచారం. ఇష్యూలోని వచ్చే నిధుల వినియోగంఐపీఓ ద్వారా సమీకరించే మొత్తాన్ని ప్రధానంగా కొత్తగా 12 విక్రయశాలలు ఏర్పాటు చేయడానికి వినియోగించనున్నారు. అలాగే ఇతర కార్పొరేట్ అవసరాలను తీర్చేందుకు ఈ నిధులను ఉపయోగిస్తారు. పబ్లిక్ ఇష్యూ పూర్తయ్యాక లలితా జువెలరీ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)ల్లో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.

Details

లీడ్ మేనేజర్లు, రిజిస్ట్రార్ వివరాలు 

ఈ ఐపీఓకు ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఈక్విరస్ కేపిటల్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, ఎంయూఎఫ్‌జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ పబ్లిక్ ఇష్యూకు రిజిస్ట్రార్‌గా నియమితమైంది. మునుపటి జ్యువెలరీ కంపెనీలు ఇప్పటికే భారతీయ స్టాక్ మార్కెట్లలో టాప్ బ్రాండ్‌లైన టైటన్‌ ఇండియా, కళ్యాణ్ జువెలర్స్, పీసీ జువెలర్స్, పీఎన్ గాడ్గిల్ జువెలర్స్, తంగమలై, టీబీజేఎస్‌ (TBZ) వంటి ఆభరణాల సంస్థలు లిస్టయి ట్రేడవుతున్నాయి. వాటి సరసన లలితా జువెలరీ కూడా త్వరలో చేరనుంది.