Page Loader
Boeing layoffs: బోయింగ్‌లో లేఆఫ్.. 400 మంది ఉద్యోగుల తొలగింపునకు నోటీసులు జారీ
బోయింగ్‌లో లేఆఫ్.. 400 మంది ఉద్యోగు తొలగింపునకు నోటీసులు జారీ

Boeing layoffs: బోయింగ్‌లో లేఆఫ్.. 400 మంది ఉద్యోగుల తొలగింపునకు నోటీసులు జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2024
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ తన ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సంస్థ 400 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్‌ నోటీసులు జారీ చేసింది. కార్మికులు సమ్మె చేయడంతో ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు బోయింగ్‌ స్పష్టం చేసింది. బోయింగ్‌ కంపెనీ, ఏరోస్పేస్‌ లేబర్‌ యూనియన్‌కు చెందిన 438 ఉద్యోగులకు లేఆఫ్‌ నోటీసులు పంపించింది. ఇందులో 218 మంది ఇంజినీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ యూనిట్ సభ్యులు ఉన్నారు. మిగిలిన ఉద్యోగులు టెక్నికల్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న సాంకేతిక నిపుణులు అని తెలిసింది.

Details

నష్టాన్ని పూడ్చేందుకే ఉద్యోగుల తొలగింపు

అర్హత ఉన్న ఉద్యోగులకు మూడు నెలలపాటు కెరీర్‌ ట్రాన్సిషన్‌ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. సియాటెల్ ప్రాంతంలో సుమారు 33 వేల మంది కార్మికులు సమ్మె నిర్వహించారు. దీని కారణంగా 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ సమ్మెతో మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.