
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ లేఆఫ్స్? మేనేజ్‌మెంట్, నాన్-టెక్ ఉద్యోగులకు షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్ బృందాల్లో ఇంజినీర్ల నిష్పత్తిని పెంచే లక్ష్యంతో ఈ లేఆఫ్స్‌ను చేపట్టనుంది.
దీని ప్రభావం ముఖ్యంగా మిడిల్ మేనేజ్‌మెంట్, నాన్-టెక్నికల్ ఉద్యోగులపై పడే అవకాశం ఉంది. మే నెలలో ఈ ఉద్యోగాల తొలగింపులు జరిగే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఈ లేఆఫ్స్ ఎన్ని మందిపై ప్రభావం చూపనున్నాయన్న విషయం అధికారికంగా ఇంకా వెల్లడికాలేదు.
ఇటీవల అమెజాన్, గూగుల్ సంస్థలు కూడా నిర్వాహక పాత్రల కంటే సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ కూడా అదే దారిలో సాగుతున్నట్టు తెలుస్తోంది.
కంపెనీ ఆదాయ వ్యయాలను సమతుల్యం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Details
గతంలో 2వేల మంది ఉద్యోగుల తొలగింపు
గతంలో కూడా మైక్రోసాఫ్ట్ తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 2,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
అదే తరహాలో, మళ్లీ జరగబోయే ఉద్యోగాల తొలగింపులు పనితీరు పరంగా వెనుకబడిన ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశముందని అంచనా. దీనిపై పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.
ఈ క్రమంలో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఏఐపై దృష్టిసారిస్తున్నాయి.
గూగుల్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలోనే 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ అందించేందుకు సన్నద్ధమవుతున్నామని ప్రకటించారు.
ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, ఉద్యోగులకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు టెక్ దిగ్గజాలు ముందడుగు వేస్తున్నాయి.