Page Loader
LGBTQ+: LGBTQ సమాజానికి గుడ్ న్యూస్.. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉమ్మడి బ్యాంక్ ఖాతాను తెరవొచ్చు 
LGBTQ సమాజానికి గుడ్ న్యూస్

LGBTQ+: LGBTQ సమాజానికి గుడ్ న్యూస్.. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉమ్మడి బ్యాంక్ ఖాతాను తెరవొచ్చు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2024
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం LGBTQ సమాజానికి గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాల విషయంలో వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్ఫష్టం చేసింది. ఉమ్మడి బ్యాంకు ఖాతా(joint bank account) ప్రారంభం లేదా తమ వ్యక్తిని నామినేట్ చేయడంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో 17 అక్టోబర్ 2023న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావించింది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌ బి ఐ) సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు దీనిపై స్పష్టత ఇచ్చినట్టు కేంద్రం తన అడ్వైజరీలో పేర్కొంది.

వివరాలు 

ట్రాన్స్‌జెండర్ సమాజానికి "రెయిన్‌బో సేవింగ్స్ ఖాతా

బ్యాంకు ఖాతాలను తెరవడంలో ట్రాన్స్‌జెండర్ సమాజానికి మద్దతుగా 2015లో ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు "థర్డ్ జెండర్" కాలమ్‌ను ఫార్మ్‌లలో చేర్చాలని ఆదేశించింది. 2022లో ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ESAF Small Finance Bank Ltd,) ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్ సమాజానికి "రెయిన్‌బో సేవింగ్స్ ఖాతా"ను ప్రవేశపెట్టింది. ఇందులో అధిక పొదుపు రేట్లు, డెబిట్ కార్డు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు (17 అక్టోబర్ 2023) తర్వాత, LGBTQ+ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు కేంద్రం కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది.