LOADING...
LIC new schemes: ఎల్‌ఐసీ నుంచి మహిళలకు 2 కొత్త స్కీమ్స్‌.. ఈ పాలసీ మహిళలకు మాత్రమే!
ఎల్‌ఐసీ నుంచి మహిళలకు 2 కొత్త స్కీమ్స్‌.. ఈ పాలసీ మహిళలకు మాత్రమే!

LIC new schemes: ఎల్‌ఐసీ నుంచి మహిళలకు 2 కొత్త స్కీమ్స్‌.. ఈ పాలసీ మహిళలకు మాత్రమే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), రెండు కొత్త పాలసీలను ఆవిష్కరించింది. అక్టోబర్ 15 నుండి ఈ పాలసీలు అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు పాలసీలు తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం 'జన సురక్ష'ను తీసుకురాగా.. 'బీమా లక్ష్మి' కేవలం మహిళల కోసం ఉద్దేశించినది..

వివరాలు 

జన సురక్ష (Plan 880) 

తక్కువ ధరలో ప్రతి ఒక్కరికీ బీమా కవరేజ్ అందించడం లక్ష్యంగా LIC ఈ పాలసీని తీసుకొచ్చింది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, కాబట్టి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కు సంబంధం లేదు,బోనస్ చెల్లింపులు ఉండవు. ప్రధాన విశేషాలు: వయసు: 18-55 సంవత్సరాలు. పాలసీ కాలం: 12-20 సంవత్సరాలు. కనీస బీమా రకం: రూ.1 లక్ష; గరిష్టం: రూ.2 లక్షలు. ప్రీమియం చెల్లింపులు: పాలసీ కాలాన్ని బట్టి ఐదు సంవత్సరాలు తక్కువగా ఉంటుంది (ఉదా: 12 ఏళ్ల పాలసీ కోసం 7 సంవత్సరాల ప్రీమియం). వార్షిక గ్యారంటీడ్ అడిషన్ (GA): 4% చొప్పున చెల్లింపు. పాలసీ చివర మెచ్యూరిటీ చెల్లింపు: హామీ మొత్తం + గ్యారంటీడ్ అడిషన్.

వివరాలు 

జన సురక్ష (Plan 880) 

పాలసీ వ్యవధిలో ఏ అపరిచిత ఘటన జరిగినా, హామీ మొత్తం చెల్లించబడుతుంది. ప్రీమియం చెల్లింపు సరళి: నెల, త్రైమాసిక, ఆరు నెలల, లేదా వార్షికంగా ఎంచుకోవచ్చు. రుణ సదుపాయం మరియు వివిధ రైడర్లు పొందవచ్చు.

వివరాలు 

బీమా లక్ష్మి (Plan 881) 

మహిళలకు ప్రత్యేకంగా బీమా + పొదుపు సదుపాయం అందించడానికి LIC ఈ పాలసీని రూపొందించింది. ఇది కూడా నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ స్కీమ్, కాబట్టి మార్కెట్ మార్పుల ప్రభావం లేదు, బోనస్ చెల్లింపులు లేవు. ప్రధాన వివరాలు: పాలసీ కాలం: 25 సంవత్సరాలు. ప్రీమియం చెల్లింపు: 7-15 సంవత్సరాల వ్యవధి ఎంచుకోవచ్చు. వయసు: 18-50 సంవత్సరాల వరకు. 'కనీస బీమా మొత్తం: రూ.2 లక్షలు, గరిష్ట పరిమితం లేదు.

వివరాలు 

చెల్లింపు ఆప్షన్‌లు: 

ఆప్షన్ A: పాలసీ పూర్తయ్యాక 50% మొత్తం చెల్లింపు. ఆప్షన్ B: ప్రతి 2 ఏళ్లకోసారి,మొత్తం 12సార్లు,హామీ మొత్తం పై 7.5%చెల్లింపు. ఆప్షన్ C: ప్రతి 4 ఏళ్లకోసారి,మొత్తం 6సార్లు,హామీ మొత్తం పై 15%చెల్లింపు. ఇతర ముఖ్య అంశాలు: ప్రీమియంపై వార్షిక 7% గ్యారంటీడ్ అడిషన్. పాలసీ చివర మెచ్యూరిటీ చెల్లింపు:హామీ మొత్తం+గ్యారంటీడ్ అడిషన్. పాలసీ కాలంలో అసలు వ్యక్తికి ఏదైనా జరిగినా,వార్షిక ప్రీమియం 10 రెట్లు లేదా హామీ మొత్తం ఏది ఎక్కువైతే చెల్లింపు. ప్రీమియం చెల్లింపు సరళి: నెల, త్రైమాసిక, ఆరు నెలల, లేదా వార్షికంగా ఎంచుకోవచ్చు. రైడర్లు: యాక్సిడెంటల్ డెత్ & డిజెబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఫీమేల్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ జోడించవచ్చు.