
X CEO: ఎక్స్ సీఈఓ పదవికి లిండా యాకారినో రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) లిండా యాకారినో ఈరోజు (జూలై 9) తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆమె ఈ ప్రకటన చేసిన వెంటనే, సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ''మీ సేవలకు ధన్యవాదాలు'' అంటూ పోస్టు చేశారు. లిండా యాకరినో 2023 మే నెలలో ఎక్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత, సంస్థకు చెందిన తొలి సీఈవోగా లిండా వ్యవహరించటం విశేషం.
వివరాలు
ఎక్స్ బృందంతో కలిసి పనిచేయడం నాకు గర్వకారణం
''ఈ రెండు సంవత్సరాల అద్భుతమైన ప్రయాణం అనంతరం సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి భావప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు, సంస్థ అభివృద్ధికి, ఎక్స్‌ను ఓ ఏవరిథింగ్ యాప్‌గా తీర్చిదిద్దే బాధ్యతలు అప్పగించిన ఎలాన్ మస్క్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. అద్భుతమైన ఎక్స్ బృందంతో కలిసి పనిచేయడం నాకు గర్వకారణం'' అని లిండా వెల్లడించారు. ఎక్స్ సీఈవోగా నియమితులయ్యే ముందు, లిండా యాకరినో ఎన్బీసీ యూనివర్సల్ సంస్థలో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగానికి చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తించారు. అంతకుముందు టర్నర్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆమె సుమారు 19 ఏళ్ల పాటు పనిచేశారు.