
Indias billion dollar IPOs:2020 నుండి భారత్‌లో బిలియన్ డాలర్ల ఐపీఓలు.. హిస్టరీపై ఓ లుక్కేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్‌మార్కెట్‌లో మంగళవారం రంగప్రవేశం చేసిన దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics IPO) షేర్లు తొలి రోజే అద్భుతమైన ప్రదర్శన కనబర్చాయి. ఇవి మార్కెట్‌లో 50 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యి దలాల్ స్ట్రీట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంత శక్తివంతమైన ప్రారంభం గతంలో 2021లో లిస్టింగ్ అయిన జొమాటో (ప్రస్తుతం ఎటర్నల్) తర్వాత మాత్రమే కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో జరిగిన బిలియన్ డాలర్ల ఐపీఓలు ఎలా రాణించాయో చూద్దాం!
వివరాలు
ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ - మార్చి 2020
దేశంలో అగ్రగామి బ్యాంక్ ఎస్‌బీఐకి చెందిన ఈ అనుబంధ సంస్థ ఐపీఓ మార్కెట్లో మొదటిరోజే 13 శాతం తగ్గుదల చవిచూసింది.ఆ సమయంలో కరోనా భయం ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని తగ్గించడంతో షేర్ ధరలు ఒత్తిడికి గురయ్యాయి. ఎటర్నల్ (మునుపటి జొమాటో)- జులై 2021 జొమాటో షేర్లు మార్కెట్లో ఇష్యూ ధరపై 51.3 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి.ఈ అద్భుత లిస్టింగ్ కారణంగా సంస్థ విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లకు చేరింది. వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం)- నవంబర్ 2021 డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటియం ఐపీఓ మాత్రం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది.షేర్లు ఇష్యూ ధరకంటే 9 శాతం తక్కువతో లిస్టింగ్ అయ్యి, అదే రోజున 27 శాతం వరకు పతనం అయ్యాయి.
వివరాలు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) - మే 2022
దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ షేర్లు స్టాక్‌మార్కెట్‌లో మొదటి రోజే దాదాపు 9 శాతం తగ్గాయి. పెద్ద ఎత్తున రిటైల్ అమ్మకాలు కారణమని నిపుణులు విశ్లేషించారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా - అక్టోబర్ 2024 భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు లిస్టింగ్ రోజున 1.5 శాతం తగ్గాయి. అధిక విలువ అంచనాలు, ఆటో రంగంలో మందగమనం కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు జాగ్రత్త వైఖరిని ఎంచుకున్నారు. స్విగ్గీ - నవంబర్ 2024 సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు పొందిన ఫుడ్ & గ్రాసరీ డెలివరీ సంస్థ స్విగ్గీ షేర్లు 5.6 శాతం ప్రీమియంతో మార్కెట్లో ప్రవేశించి, తొలిరోజే గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.
వివరాలు
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ - నవంబర్ 2024
క్లీన్ ఎనర్జీ విభాగంలో వేగంగా ఎదుగుతున్న ఈ సంస్థ షేర్లు మొదటిరోజే 14శాతం వరకు పెరిగాయి. భారత్‌లో పచ్చశక్తి అవసరాలు పెరగడం,సంస్థ బలమైన పోర్ట్‌ఫోలియో కారణంగా ఇన్వెస్టర్లు విశ్వాసం చూపారు. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ - జులై 2025 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధమైన ఈ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు లిస్టింగ్ రోజే 13 శాతం పెరిగాయి. దీని వల్ల కంపెనీ విలువ 8.2 బిలియన్ డాలర్లకు చేరింది. టాటా క్యాపిటల్ - అక్టోబర్ 2025 టాటా గ్రూప్ ఫైనాన్షియల్ విభాగం అయిన టాటా క్యాపిటల్ షేర్లు ఇష్యూ ధరకంటే స్వల్ప ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. ఈ విజయంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 15.78 బిలియన్ డాలర్లకు చేరింది.