Page Loader
జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. క్యాసినోపై 28 శాతం పన్ను
క్యాసినోపై 28 శాతం పన్ను

జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. క్యాసినోపై 28 శాతం పన్ను

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 11, 2023
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్టీ సవరణ బిల్లు - 2023కి లోక్‌సభ పచ్చజెండా ఊపింది. దీంతో ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, గుర్రపు పందేలు 28 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేశాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, క్యాసినో బెట్టింగ్, హార్స్ రేసింగ్ పై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్ - 2017 (IGST),సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్- 2017(CGST)కి సవరణలు కోరిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. మరోవైపు జీఎస్టీకి సవరణ బిల్లుపై కాంగ్రెస్‌ అభ్యంతరం లేవనెత్తింది. విపక్షాల నిరసనల మధ్యే ఆయా బిల్లులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆన్‌లైన్‌ గేమింగ్‌,క్యాసినో, గుర్రపు పందేలకు 28 శాతం జీఎస్టీ