Page Loader
కేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. మీడియా,లోక్‌సభ, రాజ్యసభ టీవీలను నియంత్రిస్తున్న కేంద్రం
మీడియాను గుప్పిట పట్టిన కేంద్రం, రాహుల్ ఫైర్

కేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. మీడియా,లోక్‌సభ, రాజ్యసభ టీవీలను నియంత్రిస్తున్న కేంద్రం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
ద్వారా సవరించబడింది Sirish Praharaju
Aug 11, 2023
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాహుల్ తీవ్రంగా స్పందించారు. దేశంలోని మీడియా కేంద్రం నియంత్రణలోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ)టీవీలను సైతం కేంద్రం తన గుప్పిట్లో బిగించిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన పనిని తాను యథావిధిగా చేసుకుపోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడైతే భరతమాత మీద దాష్టీకాలు, అఘాయిత్యాలు జరుగుతాయో అక్కడ తాను ప్రత్యక్షమవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు భరతమాతను కాపాడుకుంటానని అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 భరతమాతను కాపాడుకుంటా: రాహుల్ గాంధీ 

Details 

ఎందరో ప్రధానులను చూశాను,దిగజారి మాట్లాడిన ప్రధానిని మాత్రం చూడలేదు: రాహుల్

మణిపూర్ రాష్ట్రం ఓవైపు అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో అట్టుడుకుతుంటే, మరోవైపు పార్లమెంట్‌లో ప్రధాని నవ్వుతూ, జోకులు వేశారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎందరో ప్రధానులను చూశానని, ఇలా దిగజారి మాట్లాడిన ప్రధానిని తాను చూడలేదన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడిన తీరును రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. గురువారం లోక్‌సభలో 2 గంటల 13 నిమిషాల పాటు మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. కానీ మణిపుర్‌ అంశంపై మాత్రం కేవలం 2 నిమిషాలే మాట్లాడారని రాహుల్ గుర్తు చేశారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ నేతగా మాట్లాడకూడదని, దేశంలోని ప్రజలందరికీ ప్రధానే ప్రతినిధి అని రాహుల్‌ అభిప్రాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మణిపూర్ మండుతుంటే ప్రధాని జోకులు వేస్తున్నారు : రాహుల్