Page Loader
'శిక్షించేందుకే బ్రిటీష్ ఆ చట్టాలను తెచ్చింది.. పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు' 
పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు'

'శిక్షించేందుకే బ్రిటీష్ ఆ చట్టాలను తెచ్చింది.. పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు' 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 11, 2023
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో నేర సంబంధిత అంశాలపై న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఐపీసీ (IPC), సీఆర్‌పీసీ (CrPC), ఎవిడెన్స్‌ చట్టాల (Indian Evidence Act) స్థానంలో కొత్త బిల్లులకు రూపకల్పన చేసింది. ఈ క్రమంలోనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా మూడు బిల్లులను లోక్‌సభ(Loksabha)లో ప్రవేశపెట్టారు. 1. భారతీయ న్యాయ సంహిత- 2023 2. భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత - 2023 3. భారతీయ సాక్ష్య బిల్లు- 2023 ఆయా బిల్లులను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించనున్నట్లు షా తెలిపారు. శిక్షించడమే లక్ష్యంగా ఆంగ్లేయులు తెచ్చిన ఆ 3 చట్టాల స్థానంలో సరికొత్త చట్టాలను చేసి భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్రిటీష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో సరికొత్త బిల్లులు